»   » సూపర్ స్టార్ లో రోజు, రోజుకి ఎనర్జీలెవల్ పెరుగుతోంది..!

సూపర్ స్టార్ లో రోజు, రోజుకి ఎనర్జీలెవల్ పెరుగుతోంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల 'రోబో" తెలుగులో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలసిందే. తమిళంలో ఏవరేజ్ హిట్ అయి, హిందీలో ప్లాప్ అయిన రోబో రజనీకాంత్ కి, శంకర్ కి మంచి పేరు తెచ్చింది. తమిళంలో ఏవరేజ్ అయినప్పటికి చెన్నయ్ సిటీలోనే 10థియేటర్స్ లో 100రోజులు పూర్తి చేసుకుంది.

దీంతో రజనీకాంత్ అభిమానుల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది. వందరోజులు పూర్తి చేసుకున్న థియేటర్ల దగ్గర బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి హడావిడి చేశారు. ఇంత వయసు వచ్చినా యంగ్ హీరోలతో పోటీగా రజనీకాంత్ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, రోజురోజుకీ రజనీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందీ, తమిళ్ కంటే తెలుగులోనే 'రోబో" పెద్ద హిట్ అవ్వడం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu