»   » రజనీకాంత్ 'రోబో 2' వాలంటైన్స్ డే పోస్టర్...చూసారా అదిరింది

రజనీకాంత్ 'రోబో 2' వాలంటైన్స్ డే పోస్టర్...చూసారా అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ హిట్ చిత్రం 'రోబో' కు సీక్వెల్‌గా శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం '2.0' . ఈ చిత్రం కోసం రజనీకాంత్‌ ఎంతగానో శ్రమిస్తున్నారు. అంతకుతగినట్లుగానే ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ప్రమోషన్స్ ని ప్రారంభించింది యూనిట్.
Robo 2.0:Film’s budget crosses 450 crores


తాజాగా ... ఈ చిత్రానికి సంభందించిన వాలంటైన్స్ డే పోస్టర్ ని దర్శకుడు శంకర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తూంటే సినిమాలో లవ్ స్టోరీకి మంచి ప్రయారిటీ ఇచ్చినట్లు అర్దం అవుతోంది. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

మరో ప్రక్క ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా రూపొందుతోందనేది అఫీషియల్ వార్త. అయితే చెన్నై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ... ఈ చిత్రం బడ్జెట్ ఫైనల్ అవుట్ పుట్ వచ్చేసరికి 450 కోట్లు దాటనుందని తెలుస్తోంది. పబ్లిసిటీతో కలిసి ఐదు వందలు కోట్లు పై చిలుకు ఉండవచ్చు అంటున్నారు.

భారీ బడ్జెట్ అంటే ఏ మూడు వందల కోట్లో అని అంచనాలు వేసిన వారికి ఇది ఆశ్చర్యపరిచే వార్తే. హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ని తీసుకుని వచ్చి మరీ తీస్తూండటంతో బడ్జెట్ పెరిగిపోయిందంటున్నారు.

ఆయన క్రేజ్ తో..

ఆయన క్రేజ్ తో..

అయితే ఇంత బడ్జెట్ తో ఓ భారతీయ చిత్రం రూపొందితే ఏ రేట్లకు ఈ సినిమాని అమ్ముతారు. ఎంత వస్తే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయ్యి లాభాల్లో బయిటపడుతుంది అనే లెక్కలు ట్రేడ్ లో జరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ లోనూ ఈ చిత్రం భారీగా రిలీజ్ కానుండటంతో చాలా వరకూ ఇది సేఫ్ అంటున్నారు. అక్షయ్ కుమార్ కు ఉన్న అద్బుతమైన క్రేజ్ తో బాలీవుడ్ లో ఓ రేంజిలో మార్కెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 అదీ రోబోనే

అదీ రోబోనే

ఇక రోబో చిత్రంలో రజనీకాంత్ వశీకరన్, చిట్టీ పాత్రల్లో నటించారు. ఆ చిత్రం అమోఘ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 2.ఓ చిత్రంలో రజనీ అదనంగా మరో పాత్రలోనూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర కూడా రోబోనే నట.

మరో రోబోని రెడీ చేసి

మరో రోబోని రెడీ చేసి

రోబో చిత్రంలోని చిట్టి(రోబో)పాత్ర కోడ్‌లతో కొత్తగా మరో రోబోను విలన్ అక్షయ్‌కుమార్ తయారు చేస్తారట. కాగా ఇందులో మరో విలన్‌గా బాలీవుడ్ నటుడు సుదన్‌షా పాండే నటిస్తున్నారు. ఈ విలన్‌లను వారు కనిపెట్టిన దుష్ట రోబోను నాశనం చేయడానికి రజనీకాంత్ మరో రోబోను సృష్టించి ఎలా వారిని మట్టుపెట్టారన్నదే 2.ఓ చిత్ర ఇతివృత్తం అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట చోటు చేసుకుంటుందని తెలిసింది.

పూర్తి విభిన్నం

పూర్తి విభిన్నం

‘2.0' సీక్వెల్‌ కాదని, ఇది పూర్తిగా విభిన్నమైన చిత్రమని రసూల్‌ అన్నారు. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్ర పోషించగా, అమీజాక్సన్‌ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

పోటీ ఆ ఇద్దరు మధ్యే

పోటీ ఆ ఇద్దరు మధ్యే

ఇక ఈ సినిమాకు హైప్ రావటంతో సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని , దాన్ని కొనాలని తిరిగే తెలుగు నిర్మాతల రేసు మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ రేసులో బెల్లంకొండ సురేష్, సాహసం శ్వాసగా సాగిపో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి లు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ రైట్స్ ని చేజిక్కించుకోవాలని బేరసారాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

3డీలోనూ

3డీలోనూ

2.ఓ చిత్రాన్ని 350 కోట్లతో రూపొందిస్తున్నారన్నది సమాచారం. దాంతో దానికి తగినట్లే తెలుగు రేటు కూడా ఉండనుంది. ఈ చిత్రాన్ని సాంకేతిక పరంగా హాలీవుడ్ చిత్రాల విలువలను మించే విధంగా తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాల టాక్. అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణులు పలువురు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ 3డీ ఫార్మెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సంవత్సరమే

ఈ సంవత్సరమే

ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ‌ఆర్ రెహ్మాన్ స్వరకర్త. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్తున్నారు.ట

వంద కోట్లు దానికోసమే

వంద కోట్లు దానికోసమే

రోబో 2 సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా చేసేందుకు, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ లో భారీ మొత్తాన్ని గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేయడానికి సిద్దంగా వున్నారని వార్త. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో 2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. ఇందు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రెడీ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ.

రోబోలో హీరో రజనీకాదా..ఏంటి విషయం చూడండి

రోబోలో హీరో రజనీకాదా..ఏంటి విషయం చూడండి

రజనీకాంత్ ..రోబో 2 చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ ఆ మధ్యన జరిగింది. ఆ విశేషాలు ఇప్పటికి కథలు..కథలుగా చెప్పుకుంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది..అంత గొప్ప విశేషాలు ఏమిటి అంటే...ఇక్కడ చూడాల్సిందే

‘రోబో'-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ.. (ఫొటోలు)

 రోబో హీరోయిన్..బికినీ వేస్తే ఎలా ఉంటుంది...

రోబో హీరోయిన్..బికినీ వేస్తే ఎలా ఉంటుంది...

అవునూ..ఐ సినిమా డిజాస్టర్ అయినా శంకర్ తన హీరోయిన్ ని మాత్రం వదలలేదు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ ప్రక్కన నటించటానికి అమీలో ఏం చూసారు శంకర్ . అంటే ఈ క్రింద ఫొటోలు చూస్తే అర్దమవుతుంది


అమీ జాక్సన్ బికినీలో.... షేప్స్ చూస్తే అంతే, కాచుకోండి!! (హాట్ ఫొటోలు)

English summary
“Loading romance.. For 2.o With ARR & Karky after today’s pack up,” Shankar posted on his Twitter account, while sharing the new poster of his most-awaited film of 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu