»   »  వద్దని చెప్పారు కానీ రజనీ అని ఒప్పుకున్నా

వద్దని చెప్పారు కానీ రజనీ అని ఒప్పుకున్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నా మంచి కోరే చాలామంది రోబో-2 సైన్ చేయ్యొద్దని సలహ ఇచ్చారు. కాని రజనీకాంత్ గారు చాలా నిజాయితీగా ఉండటం నాకు నచ్చుతుంది. అందుకోసమే ఈ అవకాశాన్ని కేవలం రజని సార్ కోసమే ఒప్పుకున్నాని, లేకపోతే నా నిర్ణయం వేరేలా ఉండేదని హీరోయిన్ అమీ జాక్సన్ అన్నారు.

అమీ జాక్సన్ ... రోబో -2 కోసం సుమారు సంవత్సరం పాటు డేట్స్ ఇవ్వడం జరురుతోందని సమాచారం. అయితే దర్శకుడు శంకర్ ఈ ఇబ్బంది గమనించి...ఈ చిత్రంతో పాటు వేరే సినిమాలు చేసుకోమనడంతో ఆమె ఆనందానికి అవదులులేవు, అందులోను రజనీకాంత్ లాంటి స్టార్ తో కలిసి రోబో - 2.0 లో నటిస్తుండటం ఇంకా ఆనందంగా ఉంది.

గతంలో ఆమీ జాక్సన్ ఐ సినిమాలో విక్రమ్ సరసన నటించింది. ఐ కోసం సుమారు 2 సంవత్సరాలు కేటాయించింది, ఈ సినిమా ఆసించినంతా ఫలితం దక్కలేదు. పైగా తనకు వచ్చిన మిగతా ఆఫర్స్ అన్నిటిని వదులుకోవలసివచ్చింది.

Robo 2: Amy is work for him only

రోబో' చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రోబో2' (ఎంథిరన్‌2) చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో రజనీ సరసన ఎమీజాక్సన్‌ నటిస్తోంది.

శంకర్, రజనీకాంత్ వీరి కాంబినేషనలో వస్తున్న ఈ భారి బడ్జెట్ సినిమా కు సుమారు 400 కోట్ల రూపాయలవరకు ఖర్చు అవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి.

తమిళ సినీ వర్గాల కథనం ప్రకారం ఈ సినిమాకు ప్రోడక్షన్ కాస్టింగ్ 350 కోట్ల వరకు అవ్వోచ్చని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మెత్తం పోస్ట్ ప్రోడక్షన్ తో కలిపి 400 నుండి 450 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అంచనా ఉంది.

ఈ సినిమాలో భాగంగా అమీ శరీరాకృతికి తగ్గట్టు ప్రత్యేక దుస్తులు కూడా డిజైన్‌ చేస్తున్నారు. 3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా చేసి ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు.

సౌత్‌ నుంచి ఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.

English summary
I felt I should do Robo 2.0 as it would be an honour to work with Rajinikanth.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu