»   » 'రోబో 2'... లేటెస్ట్ ఇన్ఫో : లండన్‌లో స్క్రిప్టు వర్క్... ఇంకా

'రోబో 2'... లేటెస్ట్ ఇన్ఫో : లండన్‌లో స్క్రిప్టు వర్క్... ఇంకా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : శంకర్,రజనీ అభిమానులు ఇద్దరూ... రోబో 2 చిత్రం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇద్దరికి హిట్ కావాల్సిన సమయం ఇది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్క్రిప్టుపై రాత్రింబవళ్లూ శంకర్ కూర్చుంటునట్లు సమాచారం. ఈ మేరకు చెన్నై మీడియా సమచారం మేరకు లండన్ లో స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

భారత సినీ పరిశ్రమ గర్వించేలా విజయాన్ని సొంతం చేసుకున్న 'రోబో‌' సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని శంకర్‌ సన్నిహిత వర్గాల వద్ద ప్రస్తావించినా.. అవుననే సమాధానాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇందులో రజనీకాంత్‌ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విలన్‌గా షారఖ్‌ఖాన్‌ నటిస్తున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఓ ఎత్తయితే.. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కోలీవుడ్‌లో మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది.

Robo 2 Script work started at London

అదే... ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు రూపుదిద్దడానికి శంకర్‌ ఇటీవల లండన్‌ వెళ్లారని, ఇప్పుడు పనులు దాదాపు పూర్తయినట్లు సమాచారం. రెండో భాగానికి సంబంధించిన రోబోల రూపురేఖలను కూడా ఆయన గ్రాఫిక్‌ రూపంలో సిద్ధం చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో నిర్మాణ వర్గం ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారాన్ని వీలైనంత త్వరలోనే ప్రకటించే అవకాశముందని సమాచారం. ఆగస్టులో రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించనున్న సినిమా ప్రారంభం కానుంది. ఇది సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత ఎందిరన్‌ 2 గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

English summary
The latest hot news doing the rounds in Kollywood is that director Shankar would soon come out with the official announcement of Robo part two. Robo which was a mega hit across the globe was second film for Shankar with Rajini. Rajinkanth did a dual role. Now it's script work started at London.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu