For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పూజా హెగ్డే మీద రోజా భర్త ఫైర్.. అప్పుడు ఇద్దరు, ఇప్పుడు 12 మందా అంటూ ?

  |

  టాలీవుడ్ లోనే కాక దక్షిణాది భాషలలో సత్తా చూపించాలని పూజాహెగ్డే ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు తన దృష్టి తమిళ సినీ పరిశ్రమ మీద కూడా పెట్టింది. ప్రస్తుతం ఆమె తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో నటి రోజా భర్త తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్గా ఉన్న సెల్వమణి సంచలన ఆరోపణలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

  తమిళ సినిమాతోనే ఎంట్రీ

  తమిళ సినిమాతోనే ఎంట్రీ

  కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రులు ముంబైలో సెటిల్ అయ్యారు. అక్కడే పూజా జన్మించింది కూడా. చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తితో అనేక ఫ్యాషన్ షోస్ లో ఈ భామ పాల్గొంది. ఆ క్రేజ్ తో ఆమె ముగమూడి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమా ఛాన్స్ రావడానికి అది ఉపయోగపడిందని చెప్పచ్చు. ఇక ఆ తర్వాత తెలుగులో ఆమె ముకుందా అనే సినిమా చేసినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే రెండేళ్ల తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది.

  చేతిలో వరుస సినిమాలు

  చేతిలో వరుస సినిమాలు

  అయితే ఆ సినిమా ఆడకపోయినా తెలుగులో దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ కి పెయిర్ గా నటించడంతో మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా తరువాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆ సినిమా తర్వాత వరుసగా రంగస్థలంలో ఐటెం సాంగ్, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, బీస్ట్ లాంటి సినిమాలు ఉన్నాయి.

  సంచలన ఆరోపణలు

  సంచలన ఆరోపణలు

  ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్న నటి రోజా భర్త దర్శకుడు ఆర్.కె.సెల్వమణి పూజా హెగ్డే గురించి సంచలన ఆరోపణలు చేశారు. పూజా హెగ్డే తమతో పాటు 12 మందిని తీసుకువచ్చి నిర్మాత దగ్గర ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలాగా చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాక నిర్మాత డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. ఒకవేళ పెద్ద సినిమా అయితే కేవలం నటీనటులకు మాత్రమే 55 శాతం బడ్జెట్ రెమ్యూనరేషన్లు ఇస్తున్నారని అదే రోజుకు 16 గంటల పాటు కష్టపడి పనిచేసే వర్కర్లకు మాత్రం సినిమా బడ్జెట్ లో ఒక్క శాతం కూడా డబ్బులు సరిగా ఇవ్వడం లేదని అన్నారు.

  అప్పుడు ఇద్దరు, ఇప్పుడు పన్నెండు మందా?

  అప్పుడు ఇద్దరు, ఇప్పుడు పన్నెండు మందా?

  నటిగా మొదటి సినిమా చేసేటప్పుడు కేవలం ఇద్దరితో షూటింగ్ కి వచ్చిన పూజా హెగ్డే ఇప్పుడు బీస్ట్ సినిమా షూటింగ్ కోసం 12 మందితో వస్తూ నిర్మాతలకు అదనపు భారం పడేలా చేస్తోందని ఆయన విమర్శించారు. ఇలా నిర్మాత డబ్బులు వృధా చేయడం సరికాదని పూజా హెగ్డేకి ఆయన సూచనలు చేశారు.

  అంతే కాక మూడు సంవత్సరాల క్రితం రోజువారీ వర్కర్లకు జీతాలు విషయంలో అగ్రిమెంట్ జరిగిందని ఆ తర్వాత మళ్లీ ఇప్పటి దాకా దాని ఊసే లేదని విమర్శించారు. ఇక దక్షిణాధి భాషలలో, నటి పూజా హెగ్డేకి మార్కెట్ పెరిగింది. కాబట్టి పూజా హెగ్డే తన రెమ్యునరేషన్ 5 కోట్లకు పెంచింది. ఇది ఒకరకంగా నయనతార రెమ్యునరేషన్ కి సమానమని కూడా అంటున్నారు.

  Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
  శింబు మీద కూడా

  శింబు మీద కూడా

  సినీ నటుడు శింబు మీద కూడా ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి కొద్ది రోజుల క్రితం ఆరోప‌ణ‌లు చేశారు. తమిళ నిర్మాతల మండలికి, ఫెఫ్సీకి మధ్య త‌లెత్తిన‌ సమస్యకు శింబునే కారణమని ఆయన ఆరోపించారు. ఇక శింబు నటిస్తున్న 4 చిత్రాలకు నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు తాము కూడా ఎలాంటి సహకారం అందించలేదని అన్నారు.

  అయితే, అంత‌కుముందు నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు శింబు న‌టిస్తోన్న ఓ సినిమాకు పని చేశారని చెప్పారు. ఇక త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

  English summary
  FEFSI Chairman RK Selvamani accused pooja Hegde as she brings 12 people along with her and drags excess amount to the producer. he also lashed out at her for misusing the Producer's money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X