For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతార పై మళ్లీ ‘డర్టీ ’వార్తలు

  By Srikanya
  |

  చెన్నై: నయనతార మళ్లీ 'డర్టీ పిక్చర్' రీమేక్ లో నటిస్తుందంటూ వార్తలు చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో గుప్పుమన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించటానికి ఆమె ఏక్తాకపూర్ ని రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తోందని,దానికి ఏక్తా ఎట్టకేలకు ఒప్పుకుందని,త్వరలో సినిమా ప్రారంభం అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై చెన్నైకి చెందిన ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ నయనతార ను సంప్రదించి వివరణ అడిగింది. అయితే ఎప్పటిలాగే నయనతార..అటువంటిదేమీ లేదంటూ కొట్టిపారేసింది. అంతేగాక అంతకు మించి మాట్లాడటానికి ఆమె ఇష్టపడలేదు.

  నయనతార నటించనుందంటూ వచ్చిన వార్తలపై గతంలోనే ఆమె మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ విషయంపై వచ్చిన వార్తలన్నిటినీ కొట్టిపారేసింది. అలాగే తనకు రెండున్నర కోట్లు రెమ్యునేషన్ ఆఫర్ చేయటం, విద్యాబాలన్ లా బరువు పెరగమనంటం అన్నీ మీడియా క్రియేట్ చేసిన రూమర్సే అని అంది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేసింది. అయినా ఇలా మరోసారి ఈ వార్తలు రావటంపై ఆమెకు చెందిన మేనేజర్ ఆశ్చర్యపోతున్నారు.

  'ద డర్టీ పిక్చర్‌' రీమేక్‌లో నయనతార నటించబోతోందా అంటూ దక్షిణాది చిత్ర వర్గాల్లో కొద్ది రోజులుగా ఈ విషయమ్మీద చర్చ సాగుతోంది. విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో నయనతార నటించేందుకు ఒప్పుకొందనీ, ఆ చిత్రం కోసం నయన్‌ బరువు కూడా పెరుగుతోందనీ అన్నారు. ఈ చిత్రంలో నటించడానికి నయనతార రెండున్నర కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేశారనే వార్త కూడా వినిపించింది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఏక్తాకపూరే దక్షిణాదిన ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారనే టాక్ కూడా ఉంది.

  ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. ఇక నయనతార గొంతు త్వరలో తెలుగు తెరపై వినపడనుంది. నయనతార,రానా కాంబినేషన్ లో రూపొందుతున్న 'కృష్ణంవందే జగద్గురుమ్' సినిమా కోసం నయనతార తన గొంతును సవరించింది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే ప్రథమం. ఇందులో నయన పాత్ర పేరు దేవిక. డాషింగ్ జర్నలిస్ట్. ఈ పాత్రకు నయనతారే డబ్బింగ్ చెబితే బావుంటుందని ఆ చిత్ర దర్శకుడు క్రిష్ భావించడంతో... నయన ఉత్సాహంతో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేశారు.

  దర్శకుడు క్రిష్ తన చిత్రంలో నయనతార పాత్ర గురించి మాట్లాడుతూ.....''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

  English summary
  There are reports again that Nayanthara is likely to essay Vidya Balan's role in the critically and commercially acclaimed The Dirty Picture. It was recently reported that the actress asked producer Ekta Kapoor for a whopping Rs 2.5 crore to essay the role to which the producer is said to have even agreed. When Tamil Media got in touch with Nayanthara to confirm whether she had indeed signed on the Tamil-Telugu remake of this film, she said, "No, I am not doing it."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X