»   »  నాజర్ కొడుకు షూటింగ్...హీరోయిన్ కు చేదు అనుభవం

నాజర్ కొడుకు షూటింగ్...హీరోయిన్ కు చేదు అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తనకు షూటింగ్ సమయంలో చాలా చేదు అనుభవాలు ఎదురుకాబట్టే బయిటకు రావాల్సి వచ్చింది అంటోంది సలోని లూతేర్. నటుడు నాజర్ కొడుకు చిత్రంలో ఒక హీరోయిన్ గా చేస్తున్నఈ ముంబయి బ్యూటీ ఆ టీమ్ కు ఈ స్టేట్ మెంట్ ఇచ్చి బయిటకు వచ్చి షాక్ ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నటుడు నాజర్ కొడుకు లూత్ఫధీన్ బాషా హీరోగా పరిచయం అవుతూ.. ధనపాల్ పద్మనాభన్ దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, సలోని లుతేర్ హీరోయిన్స్ గా ఎంపిక చేసారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై సింగపూర్‌లో జరుగుతోంది.

Salony walks out of Nasser's son's film

అయితే అనుకోని ట్విస్ట్ ఇక్కడే పడింది. తనకు కథ చెప్పినట్లు గా షూట్ చేయటం లేదంటూ , మార్చేస్తున్నారంటూ సలోని లూతేర్ ఊహించని విధంగా బయిటకు వచ్చి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చింది. ఇందుకు ఆ బ్యూటీ చెబుతున్న కారణం చర్చనీయాంసంగ మారింది.

Salony walks out of Nasser's son's film

సలోని మాట్లాడుతూ... 'నేను ముంబయిలో సక్సెస్ ఫుల్ గా 45 రోజుల పాటు నిర్వహించిన నాటకంలో నటించాను. అప్పుడు దర్శకుడు ధనపాల్ పద్మనాభన్ నాకు ఫోన్ చేసి కథ వినిపించారు.కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించాను. షూటింగ్ కోసం సింగపూర్ వెళ్లాను. అయితే అక్కడ చాలా చేదు అనుభవం చవి చూడాల్సివచ్చింది. కథ చెప్పిన విధంగా దర్శకుడు షూట్ చేయకుండా వేరేగా తీస్తున్నారు.

Salony walks out of Nasser's son's film

ఆ విధానం నచ్చక పోవడంతో చిత్రం నుంచి బయిటకు రావాలనే నిర్ణయానికి వచ్చాను. ఎలాంటి పాత్ర అయినా అంకిత భావంతో నటించడానికి నేను సిద్ధం. అదే సమయంలో ఆ పాత్రపై నాకు నమ్మకం కలగడం చాలా ముఖ్యం. ఆ చిత్రంలోని పాత్ర నాకు నప్పేది కాదని అర్థమైంది. అందుకే వైదొలిగినట్లు సలోని వివరించింది. ఇంతకీ ఆమెకేం చెప్పారో..వాళ్లేం తీస్తున్నారో కూడా చెప్పి ఉంటే బాగుండేది.

English summary
Salony Luthra, who was critically acclaimed for her dual role in her debut film Sarabham, has controversially walked out of Luthfudeen Bhaasha’s (son of veteran actor Nasser) untitled film where the latter turns hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu