For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత అలా ఎందుకు మాట్లాడింది ?

  By Srikanya
  |

  చెన్నై : ''సినిమా ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సమస్యలు కూడా. నాకు అవకాశాలు లేని సమయంలో చాలా మంది సహకరించి ఈ స్థాయికి చేర్చారు. ఇప్పుడు రెండు భాషల్లోనూ చిత్రాలు చేస్తున్నా. ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండాపోయే పరిస్థితి వచ్చే వరకు ఇక్కడ కొనసాగను. అంతకుముందే నటన నుంచి తప్పుకుంటా. నాకు చాలా నచ్చిన విషయం అదే''అని సమంత పేర్కొంది. అయితే సమంతకు తప్పుకోవటమే ఆలోచన ఎందుకు వచ్చిందని సినిమావాళ్ళు ఆలోచనలో పడుతున్నారు. అయితే ఆమె ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న సికిందర్, రభస భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో ఆమె అలా మాట్లాడి ఉండవచ్చు అంటున్నారు.

  నిన్నటి వరకు తెలుగు కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన సమంత.. ఇప్పుడు తమిళ తంబీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల సూర్య సరసన నటించిన 'అంజాన్‌'లో టూ పీసెస్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో విజయ్‌ సరసన 'కత్తి'లా దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. విక్రం తదుపరి చిత్రంలోనూ ఆమె నటించనుంది. కార్తి, విశాల్‌ తదితర హీరోలు కూడా అమ్మడు కాల్షీట్‌ కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.

  Samantha About her retirement

  సమంత మాట్లాడుతూ.... ''నేను గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటే 'సమంతకు గ్లామర్‌ పాత్రలు సరిపడవా.. ఎప్పుడూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తోంది' అంటున్నారు. నేను అన్ని రకాల పాత్రలకు సరిపోతాను అని చెప్పడమే నా ఉద్దేశం. దీంతోపాటు ప్రస్తుతం పరిశ్రమలోకి కొత్త హీరోయిన్స్ చాలామంది వస్తున్నారు. వారికి ధీటుగా నిలబడాలంటే ఇలాంటివి చేయాల్సిందే. అప్పుడే పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండగలుగుతాం'' అని చెప్పింది.

  అలాగే ''నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు, నా పాత్రలు నన్ను క్లాస్‌ సినిమాల హీరోయిన్ గా పేరు తెచ్చిపెట్టాయి. అయితే మాస్‌ సినిమాలు ఎక్కువగా ఇష్టపడే 'బి', 'సి' సెంటర్లలోనూ అభిమానులతో శభాష్‌ అనిపించుకోవాలని ఉండేది. ఆ ఆలోచన తోనే తాజా చిత్రాలు ఎంచుకుంటున్నాను'' అంటోంది సమంత.

  ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవల సినిమాల్లో గ్లామర్‌ పాళ్లు కాస్త పెంచింది. ఈ మధ్య వచ్చిన 'అల్లుడు శీను','సికిందర్‌'.. 'రభస'లో అందాల ప్రదర్శనకు సమంత గేట్లు ఎత్తేసింది. ఇప్పుడు అందరి దృష్టీ సమంత పైనే ఉంది.

  English summary
  Samantha not happy with Sikindar and Rabhasa result. She talked about retirement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X