సమంత కంటే ముందు ఇద్దరు హీరోయిన్లు ఆ సినిమాకు నో చెప్పారట!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తమిళంలో 'సూపర్ డీలక్స్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29న ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఇటీవల తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సూపర్ డీలక్స్ సినిమాకు తాను ఫస్ట్ చాయిస్ కాదని, తనకంటే ముందు మరో ఇద్దరు హీరోయిన్లను దర్శకుడు సంప్రదించారని, వారు తిరస్కరించడంతో ఈ పాత్ర చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పుకొచ్చారు. ఇందులో ఆమె వేంబు అనే పాత్రలో కనిపించబోతోంది.

ఇద్దరు హీరోయిన్లు రిజక్ట్ చేసిన సినిమాను సమంత ఒప్పుకోవడంతో ఆమె హస్బెండ్ నాగ చైతన్య ఆశ్చర్యపోయారట. ఈ చిత్రంలో ఇంకా విజయ్ సేతుపతి, పహాద్ పాజిల్, రమ్యకృష్ణ, మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
జాతీయ అవార్డ్ దక్కించుకున్న 'అరణ్య కాండం' చిత్రాన్ని రూపొందించిన త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చిన 8 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన తన రెండో సినిమాగా 'సూపర్ డీలక్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











