»   » నాది ప్రేమ వివాహమే: సమంత

నాది ప్రేమ వివాహమే: సమంత

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: నేనూ అదే అనుకుంటున్నా. తప్పకుండా ప్రేమ వివాహమే. వెంటనే ఆ ప్రేమికుడు ఎవరు? ఎక్కడున్నారు? అని అడక్కండి. సమయం వస్తే నేనే చెబుతా అంది సమంత. అలాగే ప్రేమలో ఇంతవరకూ పడలేదు. మూడు, నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. హాయిగా పిల్లలతో జీవించాలనుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నందున నో ప్రేమ, నో పెళ్లి అంది. ఏమి మాయ చేసావే, బృందావనం, ఈగ చిత్రాలతో ఆకట్టుకున్న చెన్నైపొన్ను సమంత. జెస్సీగా 'ఏ మాయ చేశావె'తో అడుగుపెట్టిన ఈ అమ్మడు తమిళం కన్నా తెలుగులోనే ప్రేక్షకాదరణ అధికంగా పొందింది. ఎన్టీఆర్‌, మహేష్‌ వంటి యువహీరోల సరసన ఆడిపాడి మరింత ఇమేజ్‌ను పెంచుకుంది. ప్రసుత్తం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలోని 'ఎటో వెళ్లిపోయింది మనస్సు' చేస్తోంది.


  'ఎటో వెళ్లిపోయింది మనస్సు' తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. మూడింటిలోనూ ఈ మెరుపుతీగే హీరోయిన్. మణిరత్నం, శంకర్‌ వంటి హేమాహేమీల దర్శకత్వంలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాలతో వదులుకుంది. తన వెండితెర ప్రయాణం గురించి ఆమె మీడియాతో మాట్లాడింది. మణిరత్నం కడల్‌లో నటించకపోవడానికి కారణాలు గురించి చెపుతూ.. వాటి గురించి మాట్లాడేందుకు చాలా విషయాలున్నాయి. అయితే ఇప్పటికి వద్దనుకుంటా. 'కడల్‌' కోసం నన్ను పిలిచినప్పుడు చాలా ఆసక్తిగా వెళ్లా. కొన్ని టెస్టుల తర్వాత ఎంపికయ్యా. ప్చ్‌.. కానీ చివరకిలా అయ్యింది. కలలో కూడా వూహించలేదు ఇలా జరుగుతుందని అని అంది.

  'ఎటో వెళ్లిపోయింది మనస్సు' విశేషాలు చెప్తూ... గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో చేస్తున్న రెండో చిత్రమిది. మూడు భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగులో నాని, తమిళంలో జీవా, హిందీలో ఆదిత్యరాయ్‌ కపూర్‌లు కథానాయకులు. మూడింటిలోనూ నేనే హీరోయిన్. ఇలాంటి అవకాశం ఇదివరకు ఎవరికీ దక్కలేదనుకుంటా! ఇందులో నాది చాలా ముఖ్యమైన పాత్ర. ఇలాంటి కథ లభించడం చాలా అదృష్టం అంది. అలాగే ఇదివరకు తమిళం, తెలుగు, హిందీలో మాట్లాడలేదు. 'ఎటో వెళ్లిపోయింది మనస్సు' కి నేనే డబ్బింగ్‌ చెప్పా అని చెప్పింది.

  పరిచయం చేసిన తమిళ పరిశ్రమను మరిచిపోయినట్టున్నారు అని అంటే... అలాంటిదేం లేదు. తమిళంలో మూడు సినిమాలు విడుదలైనా మంచి అవకాశాలు లభించట్లేదు. అందుకు కారణమేంటో అర్థం కాలేదు. వచ్చినవాటిలో కథలు నచ్చట్లేదు. ఆ సమయంలోనే తెలుగులో 'వినైతాండి వరువాయా' చేశా. కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'బృందావనం', మహేష్‌తో 'దూకుడు' చేశారు. ఇవన్నీ పెద్ద విజయాలు సాధించాయి. హిట్‌ హీరోయిన్ గా గా ముద్రపడింది. అందుకే కోలీవుడ్‌పై దృష్టి పెట్టలేకపోయా అని వివరించారు.

  English summary
  Samantha says she likes love marriage rather than arranged. Then only there is high chance of mutual understanding and living happily for long time, she added.She said, i will introduce him to my parents and marry with their acceptance. She is the one of top heroines in all south Indian film industries and that makes her very happy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more