»   »  హాట్ న్యూస్: తొలిసారి తల్లి పాత్రలో సమంత

హాట్ న్యూస్: తొలిసారి తల్లి పాత్రలో సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: విభిన్నమైన పాత్ర అంటూ ముందు ఉంటుంది సమంత. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదని ఆమె నిర్చయించుకుంది. ఈ మేరకు ఆమె రీసెంట్ గా తల్లి పాత్రలో కనిపించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రాజు-రాణి దర్శకుడు అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమె తల్లిగా కనిపించనుంది.

విజయ్, సమంత మధ్య ఉండే అనుబంధం వివరిస్తూ పెళ్లి నుంచి బిడ్డ పుట్టేదాకా ఓ మెలోడియస్ సాంగ్ సైతం ఈ చిత్రం ఉండనున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం మరో హీరోయిన్ మీనా క్యూట్ బేబి నైనిక...ఈ చిత్రంలో ఈ జంటకు పుట్టిన బిడ్డగా కనిపించనుంది.

అలాగే ప్రభు,రాధికలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించనున్నారు.ప్రముఖ తమిళ దర్శకుడు మహేంద్రన్ ఈ సినిమాతో తొలి సారిగా స్క్రీన్ పై కనిపించనున్నారు. నవంబర్ 26 నుంచి షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

Samantha plays a mom role for the first time

మరో చిత్రంలో సమంత మురికివాడలకు చెందిన అమ్మాయిగా నటించనుంది. మేకప్ లేకుండా నటించడంతో పాటు ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారామె. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది.

చిత్రం వివరాల్లోకి వెళితే.... ధనుష్, సమంత జంటగా 'వడ చెన్నయ్' అనే తమిళ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. ఇందులో హీరోగా న‌టిస్తున్న ధ‌నుష్ ఏకంగా ఈ చిత్ర షూటింగ్ కోసం ఏకంగా రెండు వంద‌ల రోజులు కాల్ షీట్ ఇచ్చేశాడు. గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా నార్త్ మద్రాస్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.

    English summary
    According to sources, Samantha plays a mom in Vijay’s upcoming film with director Atlee.
    Please Wait while comments are loading...