»   » పైరసీ చేసి, సమస్యలో చిక్కుకున్న సమంత

పైరసీ చేసి, సమస్యలో చిక్కుకున్న సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఒక్కోసారి అత్యుత్సాహం కూడా కొంప ముంచుతుంది. అలాంటి సమస్యే ఇప్పుడు నటి సమంతకు వచ్చిపడింది. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో విక్రం, సమంత జంటగా నటించిన చిత్రం 'పత్తు ఎండ్రదుకుల్ల'. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు సంబంధించి నటి సమంత సమస్యల్లో చిక్కుకుంది. ఇందులో ధూమపానం చేస్తూ ఓ సన్నివేశంలో ఆమె నటించింది. ఆ ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో సమంతనే పోస్టు చేశారు. అందులోనూ అది పైరసీ సన్నివేశం కావడం గమనార్హం. దీనిపై పంపిణీదారులు మండిపడ్డారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Samantha’s ‘smoking’ re-tweet invites trouble

 పైరసీని అరికట్టాలంటూ తాము పోరాడుతుంటే.. ఇలా పైరసీ చేసిన దృశ్యాన్ని పోస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించారు. పంపిణీదారుల సంఘం మాజీ అధ్యక్షులు కలైపులి శేఖరన్‌ మాట్లాడుతూ.. ధూమపానంపై పలు స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయని తెలిపారు. దీనివల్ల అనర్థాలపై కూడా కొందరు అవగాహన కల్పిస్తున్నారని గుర్తుచేశారు. ఈ పరిస్థితిలో సమంత ఇలాంటి సన్నివేశంలో నటించడం శోచనీయమని పేర్కొన్నారు.

అది సినిమా కోసమే అని సర్దుకున్నా.. అలాంటి ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేయడం సముచితం కాదని హితవుపలికారు. దీనిపై సమంత వివరణ ఇవ్వాలని సూచించారు. పలు హిందూ సంఘాలు కూడా సమంత వైఖరిపై ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి సన్నివేశంలో ఇకపై నటించకూడదని డిమాండ్‌ చేస్తున్నాయి.

    English summary
    Samantha has incurred the wrath of the distributors recently as they felt she is encouraging video piracy. The actress acted in a dual role in her recently released film 10 Endrathukkula that had Chiyaan Vikram in the lead. Directed by Vijay Milton, apart from playing the role of a routine heroine, the Naan Ee girl also appears in the villainous role of an upper-caste leader where she was seen puffing a cigarette like a professional. Reportedly, she underwent smoking lessons for the tough baddie character. A picture of the actress taking a puff has now gone viral on the Internet. Some of her fans got excited and congratulated her on Twitter by tagging the picture from a pirated print.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu