»   » అదిరిందంతే :విక్రమ్, సమంత కొత్త చిత్రం ట్రైలర్ (వీడియో)

అదిరిందంతే :విక్రమ్, సమంత కొత్త చిత్రం ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'గోలీసోడా'తో మేకింగ్ పరంగానూ, కలెక్షన్స్ పరంగానూ తమిళ చిత్ర పరిశ్రమను షాక్ ఇచ్చిన దర్శకుడు విజయ్‌మిల్టన్‌. ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఆయన 'పత్తు ఎండ్రదుకుల్ల' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్. ఈ చిత్రం కొత్త ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

సమంత మాట్లాడుతూ...''తొలిసారిగా విక్రంతో నటిస్తున్నా. నిజానికి ఈ కార్యక్రమం కోసం పలురకాలుగా మేకప్‌ వేసుకుని వచ్చా. కానీ ఇక్కడొచ్చి చూస్తే.. విక్రం మీసమే ఈ కార్యక్రమానికి హైలెట్‌గా మారింది. ప్రతి అంశంలోనూ వైవిధ్యాన్ని కనబరిచే నటుడాయన. బయట ఇలా కనిపిస్తారేగానీ.. నటనలో ఓ శాడిస్ట్‌, ఉగ్రవాది కూడా! సెట్‌లో ఆయన నటనను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇక దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ కూడా షూటింగ్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు''అని సమంత తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మిస్తున్నారు. 


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

https://www.facebook.com/TeluguFilmibeat

అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. ''విజయ్‌మిల్టన్‌ కథ చెబుతుంటే నిజంగా ఆశ్చర్యమేసింది. ఆయన తెరకెక్కిస్తున్నప్పుడు.. ఇలా కూడా చిత్రీకరించవచ్చా అనుకున్నా. నిజానికి చాలా వైవిధ్యమైన దర్శకుడాయన. నా కెరీర్‌లోనే భిన్నమైన చిత్రంగా ఇది ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ హంగులకు ఏమాత్రం కొదవుండదు. చిత్ర టీజర్‌ చూస్తేనే సినిమా టేకింగ్‌ గురించి అర్థమవుతుంది. ఇందులో పశుపతి, రాహుల్‌దేవ్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు నటించారు. పలు ఛేజింగ్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. నా కొత్త ఆహార్యం గురించి అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇది తర్వాతి చిత్రానికి సంబంధించింది''అని తెలిపారు.

vikram 1

దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ.. '' 'ఐ'లో భారీగా అలసిపోయిన విక్రం ఇందులో అందంగా తయారయ్యారు. యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఇలా ఉండాలి, అలా కనిపించాలని ముందుగానే షరతులేవీ పెట్టలేదు. ఎలా ఉన్నా షూటింగ్‌కు వెళ్దామని చెప్పా. అయినా.. రోజూ జిమ్‌కు వెళ్లి.. చాలా ఫిట్‌గా షూటింగ్‌కు వచ్చేవారు. సన్నివేశాలకు ముందుగానే హోంవర్కు కూడా చేస్తారాయన.

adirinte1

అందువల్లే చిత్రీకరణలో ఎలాంటి జాప్యం జరుగలేదు. ఇందులో ఓ పాట మాత్రం తొమ్మిది నిమిషాల పాటు వస్తుంది. అందుకోసం బడ్జెట్‌ కూడా ఎక్కువైంది. సమంత నేపాల్‌ అమ్మాయిగా నటించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ దేశంలో కొనసాగే కొన్ని సన్నివేశాల్లో సమంత కూడా ఉన్నారు. అందువల్లే ఈ ప్రచారం సాగుతోందని భావిస్తున్నాన''ని తెలిపారు.

English summary
Watch the High Octane trailer of '10 Endrathukulla' starring Vikram & Samantha, directed by Vijay Milton. The music is composed by D. Imman and produced by Fox Star Studios and AR Murugadoss .The music is composed by D. Imman and produced by Fox Star Studios and AR Murugadoss
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu