Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సమంత
చెన్నై : తెలుగు,తమిళ భాషల్లో తిరుగులేని దర్శకుడుగా ఎదిగిన మురగదాస్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా సమంత ఎంపికైంది. 'తలైవా'(అన్న) తో అభిమానులను ఆకట్టుకుంటున్న 'ఇలయ తలబది' విజయ్ సరసన సమంత ఆడిపాడనుంది. 'బానా కాత్తాడి'తో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన సమంత తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా హవా చాటుకుంటోంది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ తీరికలేకుండా ఉంది. ఇప్పుడు సొంతగడ్డ కోలీవుడ్‌లోనూ దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.
విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'తుపాక్కి' భారీ వసూళ్లు దక్కించుకుంది. మళ్లీ వారి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. 'అదిరడి' అనే పేరును పరిశీలిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూర్చనున్నారు. ఏఆర్ మురగదాస్ మాట్లాడుతూ.. విజయ్‌తో సినిమాను తెరకెక్కించనున్నట్లు వస్తున్న వార్తలు నిజమే. ఇంకా పేరు ఖరారు చేయలేదు. కొన్నింటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.
సమంత సినిమాల వివరాల్లోకి వెళితే.. 'అత్తారింటికి దారేది' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆమె పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం', జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా', 'రభస'తో పాటు మరో రెండు చిత్రాలు చేస్తోంది. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ బిజీగా గడుపుతోంది సమంత.
ప్రత్యూష ఫౌండేషన్ కోసం నిధులు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సినిమాల్లో ఉపయోగించిన పాపులర్ సినీ స్టార్స్ డ్రెస్సులను వేలం వేసి, తద్వారా వచ్చే డబ్బును 'ప్రత్యూష ఫౌండేషన్' కోసం విరాళంగా ఇచ్చేందుకు ప్లాన్ చేసారు. తొలి వేలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్'లో పవన్ ధరించి పోలీస్ యూనిఫాంను వేలానికి పెట్టనున్నారు. త్వరలో వేలం ఎక్కడ జరుగుతుంది? బిడ్డింగ్ ధర ఎంతతో మొదలవుతుంది? అనే విషయాలు వెల్లడించనున్నట్లు సమంత ట్విట్టర్లో పేర్కొంది.