»   » పోలీసులకు పట్టుబడ్డ సమీరా రెడ్డి...

పోలీసులకు పట్టుబడ్డ సమీరా రెడ్డి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అశోక్, నరసింహుడు, జై చిరంజీవ చిత్రాలతో తెలుగు వారిని పలకరించిన సమీరా రెడ్డి రీసెంట్ గా ఓ పోలీస్ కేసులో ఇరుక్కుంది. అయితే అది అదేమీ సీరియస్ దీ కాదు అతి పెద్దది కాదు. ఫోన్లో మాట్లాడుతూ కారు నడపటంతో ముంబయి పోలీసులు పట్టుకున్నారు. శాంత్రాజ్‌ విమానాశ్రయం సమీపంలో సమీరాని ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ అనుభవాన్ని సమీరా రెడ్డి ఇలా చెప్పుకొచ్చింది..."నిజానికి నేను మాట్లాడుతూ నడపలేదు. నా ఫోన్‌లో వస్తున్న పాటకు అనుగుణంగా నేను పెదాలు కదుపుతూ నడిపానంతే. ట్రాఫిక్‌ పోలీస్‌ అపార్థం చేసుకున్నారు. విషయాన్ని వివరించినా వినలేదు. పోనీ చలాను రాసివ్వమంటే రాయలేదు. పక్కనున్న పోలీసుతో చెప్పినా ఫలితం లేదు. నాకు అర్థమైందల్లా ఒకటే. వారు నా నుంచి లంచం ఆశించారు. పైసా కూడా ఇవ్వలేదు. అప్పటికే నన్ను చుట్టుపక్కల వారు గుర్తుపట్టడంతో పోలీసులు వదిలేశారు" అంటోంది. అయితే పోలీసులు మాత్రం ఆమె సెల్ ఫోన్ లో మాట్లాడటం చూసామని, అందుకే ఆపామని, అయితే ఆమె సెలబ్రిటి కావటంతో తప్పించుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం సమీరా రెడ్డి...గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి కమిట్ అయ్యింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu