»   » గౌతమ్‌ మీనన్‌ చంపేస్తారేమో...సమీరా రెడ్డి

గౌతమ్‌ మీనన్‌ చంపేస్తారేమో...సమీరా రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం చిత్రీకరణ రాత్రిపూట ఎక్కువగా జరుగుతోంది. ఎందుకంటే థ్రిల్లర్‌ సినిమా కదా! భయపెట్టాలంటే చీకటి ఉండాలి. సినిమా పూర్తయ్యే సమయానికి నా పాత్రను గౌతమ్‌ మీనన్‌ చంపేస్తారేమో నాక్కూడా తెలియదు. అలా చేయరని అనుకుంటున్నాను అంటోంది సమీరా రెడ్డి. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ధ్రిల్లర్ లో నటిస్తోంది. అందులో ఆమె పాత్ర పేరు సుకన్య. పాత్ర, కధ, కథనం గురించి చెబుతూ...ఖచ్చితంగా ఈ పాత్ర అందర్నీ మెప్పిస్తుంది. నేను కూడా ఆ పాత్రను తెరమీద చూసుకోవడానికి ఎంతో ఉద్వేగంగా ఎదరుచూస్తున్నాను. థ్రిల్లర్‌ తరహా కథాంశం కావడంతో ప్రేక్షకులంతా సీటు అంచున కూర్చొని సినిమా చూడాల్సి రావచ్చు. సినిమాలో తరవాత వచ్చే ఏ సన్నివేశాన్ని మీరు ఊహించలేనంతగా ఉంటుంది. సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుఝామున మూడింటి వరకూ చిత్రీకరణలో పాల్గొంటున్నాను. అప్పుడు వెళ్లి పడుకొంటే ఇక ఎక్కడ లేచేది..? గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసమే ఈ కష్టం అంతా..అంటోందీ ముద్దుగుమ్మ. ఇంతకుముందు సమీరా రెడ్డి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu