»   » ఆ దర్శకుడు సమీరా రెడ్డిని వదలలేకున్నాడా?

ఆ దర్శకుడు సమీరా రెడ్డిని వదలలేకున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో అశోక్, జై చిరంజీవ, నరసింహా చిత్రాలు చేసిన సమీరా రెడ్డి తాజాగా తమిళ దర్శకుడు గౌతం మీనన్ డైరక్ట్ చేస్తున్న ఓ ధ్లిల్లర్ లో సోలోగా నటిస్తోంది. ఇంతకుముందు సూర్య హీరోగా వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్న గౌతం మీనన్ ఇప్పుడీ ధ్రిల్లర్ లో ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే త్వరలో విక్రమ్ తో ప్రారంభించించనున్న యాక్షన్ ఓరియెంటెడ్ ధ్రిల్లర్ లో కూడా ఆమెనే రికమెండ్ చేస్తున్నారు. ఆ చిత్రం నవంబర్ 2010 లో ప్రారంభమవుతుంది. దాంతో గౌతం మీనన్ దర్సకత్వంలో చేయాలని ఆశపడుతున్న మిగాతా హీరోయిన్స్ మండిపడుతున్నారు. ఏం నచ్చిందనో సమీరా వెనకపడుతున్నాడు. ఆమెకు నటనకూడా సరిగా రాదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక గౌతం మీనన్ ఏమి మాయ చేసావే చిత్రం తర్వాత ఫుల్ బిజీ అయి పోయారు. అజిత్ తో కావల్ అనే చిత్రం ఈ ధ్రిల్లర్ తర్వాత చేయటానికి అడ్వాన్స్ తీసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu