»   » నిద్రలో నడిచే అలవాటుతో సమీరా రెడ్డి

నిద్రలో నడిచే అలవాటుతో సమీరా రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరవ సంవత్సరం నుంచీ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని,గత ఇరవై సంవత్సరాలుగా తాను దాంతో ఇబ్బంది పడుతున్నానని చెప్తోంది సమీరా రెడ్డి. రీసెంట్ గా చెన్నైలో జరిగిన అమ్మ భగవాన్ వారి కోర్స్ చేసాక దాని నుండి విముక్తిరాలు అయినట్లు ఆమె వివరిస్తోంది. ఆ కోర్సుకు ఆమెను షమితా శెట్టి తీసుకు వెళ్ళి పరిచయం చేసిందని చెప్పుకొచ్చింది. ఆ కోర్సు చేసాక రాత్రిళ్ళు ప్రశాంతంగా చిన్న బేబీలా నిద్రపోతున్నానని చెప్పుకొచ్చింది.

ఇక సమీరా రెడ్డి తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి అశోక్,నరసింహుడు చిత్రాల్లో నటించింది. అలాగే చిరంజీవి సరసన జై చిరంజీవ చిత్రంలో చేసింది. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. ఆ మధ్య సూర్య సరసన గౌతం మీనన్ దర్శకత్వంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలోనూ కనపించి అందాలు ఆరపోసినా ఫలించలేదు. ప్రస్తుతం ఆమె మళ్ళీ గౌతం మీనన్ దర్శకత్వంలోనే ఇంకా పేరు పెట్టని చిత్రంలో సెక్స్ వర్కర్ గా కనిపించనుంది. ఓ రాత్రి జరిగే కథ ఇదని, ఓ కొత్త వ్యక్తితో ఓ వేశ్య కి జరిగే అనుభావాల సమాహారమేనని ఈ చిత్రం కధ గురించి చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu