»   » డ్రస్ ల విషయమై హీరోయిన్ గొడవ...వివాదం

డ్రస్ ల విషయమై హీరోయిన్ గొడవ...వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : 'ప్రేమిస్తే'తో చక్కని గుర్తింపు తెచ్చుకుని అందరికీ సుపరిచితురాలైన హీరోయిన్ సంధ్య. ఆపై కొన్ని విజయవంతమైన చిత్రాల్లోనూ నటించింది. కొద్ది రోజులుగా మాతృభాష మలయాళానికే పరిమితమైంది. కాస్త విరామం తర్వాత 'యా..యా'తో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.

తమిళంలో 'మాయై' అనే సినిమాలో హీరోయిన్ నటన ఆకట్టుకునేలా లేదని తప్పించారు. ఆ పాత్రకు సంధ్యను ఎంపిక చేశారు. షూటింగ్ కు వెళ్లిన సంధ్య చేతిలో అత్యంత కురచ దుస్తులు పెట్టారట. కంగుతిన్న సంధ్య... విషయం నాకు ముందే చెప్పాలి కదా అంటూ ఫైరైంది.

అలాగే ఇలాంటి పాత్రల్లో నటించేందుకు ఐటంభామను కాదని తేల్చిచెప్పిందట. నిర్మాత, దర్శకుడు ఎంత వారిస్తున్నా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందట. అడ్వాన్స్‌ తీసుకున్నాక నటించేందుకు నిరాకరించిన సంధ్యపై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నాడట ఆ చిత్ర నిర్మాత.

English summary
After some break, Sandhya is back in Tamil films and is playing the lead role in Maayai, which deals with the dangerous consequences of one-sided love affairs, which afflicts many adults in schools and colleges. Rajendran, who played a significant role in Bala’s Naan Kadavul, is said to have excelled as a ‘psychic villain’ in Maayai. The script is all about how Sandhya, who plays the heroine, wriggles herself out of his custod
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu