»   » కళ్యాణ్ రామ్ సినిమాలో చేసాకే ఇలా అయిందని ఏడుస్తోంది

కళ్యాణ్ రామ్ సినిమాలో చేసాకే ఇలా అయిందని ఏడుస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరసగా చెల్లెలు పాత్రలు వస్తూండటంతో విసుగెత్తిపోతున్నానంటోంది శరణ్యా మోహన్.కళ్యాణ్ రామ్ చిత్రం కత్తిలో చెల్లిగా నటించిన ఆమెకు ఆ సినిమా ఆడకపోయినా అన్ని చెల్లి పాత్రలే రావటంతో అర్దం కాని పరిస్ధితి నెలకొంది.దాంతో ఇకపై చెల్లెలి పాత్రల్లో నటించేది లేదని తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు గట్టిగా చెబుతోందని తెలుస్తోంది.అంతేకాక హీరోయిన్లు రేవతి, శోభన అంటే తనకెంతో ఇష్టమని, వారి పోషించిన లాంటి పాత్రల్లో నటించాలనే కోరికను వెళ్ళబుచ్చుతోంది.

ఇక 'విలేజ్‌లో వినాయకుడు' చిత్రంలో కృష్ణుడు సరసన హీరోయిన్‌గా నటించిన శరణ్య ఆ తర్వాత నానీ సరసన 'బీమిలీ కబడ్డీ జట్టు'లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే కళ్యాణ్‌ రామ్‌కు చెల్లెలుగా ఆమె నటించిన 'కత్తి' చిత్రం అంతగా ఆడకపోవటంతో శరణ్య నిరాశకు గురైంది.అదే సమయంలో అటు తమిళంలో, ఇటు తెలుగులో చెల్లెలి పాత్రలు తనను వెదుక్కుంటూ వస్తుండటంతో ఆమె ఒకింత కంగారు పడుతోంది.ఇప్పుడు తమిళంలో విజయ్ చెల్లిగా వేలాయుదం చిత్రంలో చేస్తోంది.

English summary
Saranya Mohan is going to play Ilayathalapathy Vijay’s sister in his new Jayam Raja directed Velayudham.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X