»   » హాస్పటిల్ పాలైన శరత్ కుమార్ , ఆరోగ్యం నిలకడగానే

హాస్పటిల్ పాలైన శరత్ కుమార్ , ఆరోగ్యం నిలకడగానే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరో శరత్‌కుమార్‌ తీవ్రమైన గుండె నొప్పితో గురువారం చెన్నైలోని ఆపోలో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం..ఆయన జిమ్ లో ఉండగా కడుపులో నొప్పిగా ఉందని కూలిపోయారు. ఆయన వయస్సు 61. దాంతో డాక్టర్లు టెస్ట్ లు అన్ని చేసారు. అది గుండె నొప్పి కాదని, ఫుడ్ పాయిజనింగ్ తో ఆ నొప్పి వచ్చిందని తేల్చారు. అయితే కొన్ని రిపోర్ట్ లలో మాత్రం వర్కవుట్స్ చేస్తున్నప్పుడు మైల్డ్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందని అంటున్నారు.

ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు మాట్లాడుతూ,'ప్రస్తుతం శరత్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. క్రమ క్రమంగా మెరుగుపడుతోంది. త్వరలోనే ఆయన సంపూర్ణంగా కోలుకుంటారు' అని చెప్పారు.

sarath

అటు నటుడిగా, ఇటు రాజకీయనాయకుడిగా శరత్‌కుమార్‌ తమిళనాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాధికను వివాహమాడిన శరత్‌కుమార్‌ తమిళ చిత్రాలెన్నో తెలుగు నాట కూడా ప్రదర్శితమై విశేష ఆదరణ పొందాయి. శరత్‌కుమార్‌ ఆరోగ్యం త్వరగా మెరుగు పడాలని తమిళ సినీ ప్రముఖులు సామాజిక మీడియా ద్వారా స్పీడీ రికవరీ విషెస్‌ తెలిపారు.

English summary
Tamil actor-politician R. Sarath Kumar on Thursday was rushed to a private hospital in Chennai, according to sources, after he complained of pain in the abdomen. It turns out, it was a false alarm and the actor was merely down due to food poisoning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu