»   » షూటింగ్ వదేలేసి దుబాయి చెక్కేస్తావా, వదలం..నిర్మాత వార్నింగ్

షూటింగ్ వదేలేసి దుబాయి చెక్కేస్తావా, వదలం..నిర్మాత వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అడ్వాన్స్ తీసుకుని, డేట్స్ ఇచ్చిన తర్వాత షూటింగ్ కు డుమ్మా కొడితే ఊరుకుంటారా. ఏదన్నా సమస్య ఉందేమో అని రెండు రోజులు చూస్తారు, మూడు రోజులు చూస్తారు..అప్పటికీ స్పందించకపోతే, కోట్లతో వ్యవహారం కోర్టుకు లాగుతారు ఇప్పుడు అదే తమిళ హీరోయిన్ ఇషారా కు జరుగుతోంది. ఆమెను కోర్టుకు ఈడుస్తామంటున్నారు ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర దర్శకనిర్మాతలు.

పూర్తి వివరాల్లోకి వెళితే...తమిళ చిత్రాలు చదరంగవేట్టై, పప్పాళి చిత్రాల హీరోయిన్ ఇషారా. కేరళకు చెందిన ఈమె రీసెంట్ గా కల్లూరి చిత్రం ఫేమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్‌గా ఎగ్రిమెంట్ చేసుకుంది. టీఎన్.75 కేకే క్రియేషన్స్ పతాకంపై జోసెఫ్ లారెన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Sathuranga Vettai actress goes into hiding from producers

ఈ చిత్రంలో రెండు రోజులు మాత్రమే నటించిన నటి ఇషారా ఆ తరువాత షూటింగ్ కు రాకుండా డుమ్మా కొట్టి చిత్ర దర్శక నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నారట. ఇషారా ప్రవర్తనకు విసిగి వేసారిన వారు ఆమెను కోర్టులో చూసుకుంటామని, వదలబోమని వార్నింగ్ ఇస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... 'మా ఎండడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి నటి ఇషారాను నాలుగు లక్షల పారితోషికానికి 28-02-2016న ఒప్పందం కుదుర్చుకుని రూ.75 వేలు అడ్వాన్స్ చెల్లించాం. ఆమెను 20 రోజుల కాల్‌షీట్స్ అడిగాం. అయితే రెండు రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొని ఆ తరువాత ఎస్కేప్ అయ్యారు.

Sathuranga Vettai actress goes into hiding from producers

మేం ఫోన్ చేస్తే తాను దుబాయ్‌లో ఉన్నాను, కేరళలో ఉన్నాను, వేరే షూటింగ్‌లో ఉన్నాను అంటూ చెబుతున్నారు. మరోసారి దర్శకుడు ముందు చెప్పిన కథ వేరు ఇప్పుడు తీస్తున్న కథ వేరు అని సాకు చెప్తోంది. మరో సారి ఆమెను ఫోన్‌లో సంప్రదించగా ఎవరిదో మగ గొంతు పిలుస్తాను ఉండండి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

దీంతో కథలో ఏమైనా మార్పులు చేయడానికైనా సిద్ధం అని మెసేజ్ పెట్టగా ఇదుగో వస్తున్నా, అదుగో వస్తున్నా అని చెప్పి షూటింగ్‌కు రాలేదు.వేరే దారి లేక మేము కేరళ నడిగర్ సంఘాన్ని ఆశ్రయించాం. వారికి ఇషారా సరైన సమాధానం ఇవ్వలేదట. మరో ప్రయత్నంగా నిర్మాతల గిల్డ్‌కు చెందిన జాగ్వుర్‌తంగం ద్వారా ఇషారాతో మాట్లాడించాం.

Sathuranga Vettai actress goes into hiding from producers

ఆయనకు సరైన బదులు ఇవ్వలేదు. ఇక లాభం లేదని పత్రికలకెక్కుతామనీ, కోర్టుకెళ్లతామనీ చెప్పాం. అందుకామె వెళ్లండి అంటూ చాలా కేర్‌లెస్‌గా బదులిచ్చారు. ఇలాంటి వారిని నమ్మి మాలాంటి నిర్మాతలు కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాం. మా పెట్టుబడులతో ఆడుకునే ఇషారాను కోర్టుకు ఈడుస్తాం' అని ఎంగడా ఇదుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర నిర్మాతలు తెలిపారు.

English summary
Ishaara Nair was paired opposite actor Akhil of Kalloori fame and had signed the dotted line with an agreed remuneration of Rs.4 Lakhs on February 28. Later she had joined the team for just 2 days but full commitment from her side. After those 2 days, when the producer approached her to get call sheet for the remaining 18 days, she had been slipping from them with lame excuses like she is at Dubai, Kerala in the shooting of other movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu