»   » బాహబలి 'కట్టప్ప'... ఇప్పుడు 'దొర'

బాహబలి 'కట్టప్ప'... ఇప్పుడు 'దొర'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి చిత్రంలో కట్టప్పగా కనిపించి అలరించిన సత్యరాజ్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ఇప్పుడు తెలుగులోనూ విడుదల అవుతోంది. సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్‌, బింధుమాధవి జంటగా రూపొం దుతున్న తమిళ చిత్రం 'జాక్సనదురై'. ధరణీ ధరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'దొర' పేరుతో రత్న సెల్యూలాయిడ్‌ పతాకంపై జక్కం జవహర్‌బాబు తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సత్యరాజ్‌ కీలకపాత్రలో కనిపిస్తారు.

జవహర్‌బాబు మాట్లాడుతూ ''పీరియాడికల్‌ హారర్‌ చిత్రమిది. దొరగా, దెయ్యంగా సత్యరాజ్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

Satya Raj's Jackson Dorai as Dora in telugu

ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై పెద్ద హిట్టైంది. శిబిరాజ్ నటిస్తున్న ఈ తమిళ సినిమాలోను సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శిబిరాజ్, బింధు మాధవి హీరో హీరోయిన్లుగా.. ధరణి ధరన్ దర్శకత్వంలో జాక్సన్ దురై అనే సినిమా తెరకెక్కుతోంది. కొడుకు శిబిరాజ్ నటిస్తున్న 'జాక్సన్ దురై'లో సత్యరాజ్ పోషిస్తున్న పాత్రే ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది.

విశేషం ఏమంటే.... ఇందులో దెయ్యంగా కనిపించనున్నాడట సత్యరాజ్. క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సత్యరాజ్ ఒక్కసారిగా ఘోస్ట్ గా నటిస్తుండడంతో ఈ సినిమా పై కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు. ఈ సినిమాలో సత్యరాజ్ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారట దర్శక నిర్మాతలు.

హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న జాక్సన్ దురై లో కేవలం మూడు పాటలే ఉంటాయట. మరి దెయ్యంగా మారబోతున్న సత్యరాజ్ జనాలను ఎలా భయ పెడతాడో చూడాలి.

English summary
Satya Raj's Jackson Durai -PAYing Guest is an upcoming Tamil horror comedy film written and directed by Dharani Dharan. This film dubbed in telugu as Dora.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu