twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కట్టప్ప కూతురు సంచలన నిర్ణయం.. త్వరలో రాజకీయాల్లోకి?

    |

    Recommended Video

    Sathyaraj's Daughter Divya Sathyaraj To Enter Into Politics ? || Filmibeat Telugu

    బాహుబలి సినిమాలో 'కట్టప్ప' పాత్ర పోషించిన తమిళ నటుడు సత్యరాజ్ దేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఆయన మరింత బిజీ యాక్టర్ అయ్యారు. సత్యరాజ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు శిబి సత్యరాజ్ సినిమాల్లో రాణిస్తుండగా... కూతురు దివ్య మాత్రం సినిమా రంగం వైపు రాకుండా న్యూట్రిషియనిస్ట్‌గా పని చేస్తున్నారు.

    ఎన్నడూ లేని విధంగా సత్యరాజ్ కూతురు దివ్య తాజాగా వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడమే అందుకు కారణం. కొన్ని రోజుల క్రితం సత్యరాజ్ వివాదాస్పద పొలిటికల్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కడం, ఇపుడు దివ్య నుంచి ఇలాంటి ప్రకటన రావడం చర్చనీయాంశం అయింది.

    ఫేమస్ న్యూట్రిషియనిస్ట్

    ఫేమస్ న్యూట్రిషియనిస్ట్

    దివ్య చెన్నైలో ఫేమస్ న్యూట్రిషియనిస్ట్. హెల్త్ కేర్ విభాగంలో తన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్ సిస్టం సరిగా లేదని భావిస్తున్న ఆమె రాజకీయాల్లోకి రావడం ద్వారా వ్యవస్థలో మార్పు తేవాలనే ఆలోచనలో ఉందట.

    రాజకీయాల్లో ఉండటం వల్లే సాధ్యం

    రాజకీయాల్లో ఉండటం వల్లే సాధ్యం

    రాష్ట్రంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, రాజకీయాల్లో ఉండటం వల్లనే వ్యవస్థలో మార్పు తేవడం సాధ్యమని దివ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.

    డిఎంకె పార్టీ తరుపున?

    డిఎంకె పార్టీ తరుపున?

    సత్యరాజ్ ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. దివ్య కూడా ఇదే పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకె పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

    కమల్, రజనీ మీద సత్యరాజ్ కామెంట్స్

    కమల్, రజనీ మీద సత్యరాజ్ కామెంట్స్

    ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎక్కడా శూన్యత కనిపించలేదని, కొత్తగా పార్టీలు పెట్టిన వారు కూడా ఎక్కడా కనిపించలేదని రజనీకాంత్, కమల్ హాసన్‌ను ఉద్దేశించి సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. స్టాలిన్ సమర్ధుడని తమిళ ప్రజలు నమ్మారు కాబట్టే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించారని వ్యాఖ్యానించారు. స్థానికేతరులు తమిళనాట రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదంటూ సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను ఉద్దేశించి సత్యరాజ్ ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో శూన్యత ఏదైనా ఉంటే దాన్ని భర్తీ చేయడానికి స్టాలిన్, దయానిధి మారన్ లాంటి వారు ఉన్నారని తెలిపారు.

    English summary
    Tami actor Satyaraj daughter Divya Satyaraj is all set to enter politics soon. In a recent interview, Divya said that she wants her state to have a proper health care system and to do this she has to be in politics and take charge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X