»   » 'రక్త చరిత్ర' లో ఆ సీన్ వెంటాడి..వేధించింది...హీరో సూర్య

'రక్త చరిత్ర' లో ఆ సీన్ వెంటాడి..వేధించింది...హీరో సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" చిత్రంలో ఓ సన్నివేశం చేసిన తర్వాత ఓ పూట వరకూ మామూలు మనిషిని కాలేకపోయానంటూ హీరో సూర్య తన అనుభూతులను వివరించారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఆ సన్నివేశంలో నేను జైలులో ఉంటాను. నా జైల్ మేట్స్ తో నా జరిగిన గతం గురించి చెబుతూంటాను...ఆ డైలాగ్...రెండు ముక్కలైన నా తల్లిని చూసాను. నా చెల్లెలు పూర్తిగా కాలిపోయి జీవఛ్చవంలా మారిపోయింది. కేవలం ఆమె మెడలో నక్లెస్ చూసే గుర్తు పట్టాను. ఇక నా సోదరుడు ముక్కలైన శరీరాన్నైతే అస్సలు గుర్తే పట్టలేకపోయాను. ..ఇలా సాగే ఈ డైలాగు లో మొత్తం కెమెరా ఫోకస్ నాకు క్లోజప్ లో ఉంటుంది. కేవలం నా ఎక్పప్రెషన్స్ పైనే ఆ సన్నివేశం ఆధారపడి ఉంటుంది. వికృతమైన ఆ నిజాన్ని భరిస్తూ నేను చెప్పే ఆ డైలాగు వాస్తవంగా రావటం కోసం నా జీవితంలోని విషాదాన్నంతా గుర్తు చేసుకున్నాను. దాంతో దాన్నించి బయిటపడటానికి ఓ పూట సమయం తీసుకుంది అన్నారు."రక్త చరిత్ర" పార్ట్-2, తమిళంలో రక్త చరిత్రం ఒకే సారి డిసెంబర్ మూడున విడుదల కానున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu