»   » ప్రకాష్ రాజ్ ఓవర్ యాక్షన్ వెనుక అసలు సంగతి ఇదీ..!

ప్రకాష్ రాజ్ ఓవర్ యాక్షన్ వెనుక అసలు సంగతి ఇదీ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మంచి నటుడే కావచ్చు కానీ ఆయనతో సినిమా తీయాలంటే నిర్మాతలకు తలనొప్పులు తప్పవు. షూటింగ్ లను ఎగ్గొట్టడం ఆయనకు చాలా సరదా.. దీంతో ఇప్పటికే ఆయన చాలా సార్లు టాలీవుడ్ నుండీ బహిష్కరణకు గురయ్యాడు కూడా. ఇక ఆయన తన సినిమాల ప్రచారానికి రావడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆయన మరే సినిమా ప్రచారానికీ రాలేదు. బొమ్మరిల్లు నిర్మాత దిల్ రాజు కావడం వల్లే ఆయన బ్రతిమలాడటంతో అక్కడి వచ్చడనే టాక్ కూడా వుంది. చివరికి తనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన కాంచీవర్ సినిమా తెలుగులో విడుదలయిన సంగతి కూడా చాలా మందికి తెలియదంటే ఈయన గారు తన సినిమాల మీద చూపే శ్రద్ధ అర్థమవుతుంది.

అలాంటి ప్రకాశ్ రాజ్ ఈ మధ్య శేఖర్ కమ్ముల రూపొందించిన లీడర్ సినిమా అద్భుతం అని ఈ సినిమా ముందు మణిరత్నం రూపొందించిన నాయకుడు సినిమా కూడా బలాదూర్ అనేంతగా ఆయన మాట్లాడాడు. అది విన్న చాలా మంది ఆశ్చర్యపోయారు. అదేంటి ప్రకాష్ మారిపోయాడా ఏంటి అని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిస్తే ప్రకాష్ రాజ్ నిజంగా దేవాంతకుడే అనుకుంటారు.

అసలు సంగతి ఏంటంటే శేఖర్ కమ్ముల రూపొందించిన హ్యాపీడేస్ సినిమాను ప్రకాష్ రాజ్ తమిళ్ లో రూపొదిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దీంతో శేఖర్ కమ్ముల ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ప్రకాష్ రాజ్ లీడర్ వంటి సినిమాలో నటించనందుకు జీవితాంతం బాధపడతానని ఓ రేంజిలో ఓవర్ యాక్షన్ చేసాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu