»   » '7/జి బృందావన్ కాలనీ' హీరోయిన్ కి విడాకులు మంజూరు

'7/జి బృందావన్ కాలనీ' హీరోయిన్ కి విడాకులు మంజూరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కీ, నటి సోనియా అగర్వాల్ దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరూ ఈ నెల తొమ్మిదవ తేదీన పరస్పర అవాగాహనతో విడిపోతున్నట్టు పేర్కొంటూ కోర్టులో డైవోర్స్ సూట్ ను దాఖలు చేశారు. విచారణకు దంపతులిద్దరూ హాజరయ్యారు. వీరిని రాజీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే తమకు విడాకులు ఇప్పించాలని గత డిసెంబరులో ఇద్దరి తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి మార్చి 17కు వాయిదా వేశారు. వాయిదా తేదీకి ముందుగానే ఈ పిటిషన్‌పై 9వ తేదీన విచారణ జరిగింది. దీంతో 12వ తేదీకి తీర్పును కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ రామలింగం శుక్రవారంనాడు ఈ ఇద్దరికీ విడాకులు మంజూరు చేశారు.

సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కాదల్‌ కొండేన్‌ చిత్రం ద్వారా సోనియా అగర్వాల్‌ తమిళ చిత్ర సీమకు పరిచయమయ్యారు. తదుపరి ఆయన దర్శకత్వంలోనే '7/జి రెయిన్‌బో కాలనీ, పుదుపెట్టై (ధూల్ పేట) చిత్రాలలో ఆమె నటించారు. వీరిరువురూ ప్రేమించుకొని 2006 డిసెంబరు 15న వివాహం చేసుకున్నారు. వీరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో... రెండేళ్ల కాపురం అనంతరం 2009 ఆగస్టులో విడాకులు కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెలుగులో రాణా హీరోగా ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఇక ఆయన గత చిత్రం యుగానికొక్కడు తెలుగు,తమిళ భాషల్లో రిలీజై డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu