»   » 'కలర్స్' స్వాతిని పెళ్లిచేసుకుంటానంటూ వెంటపడుతున్న దర్శకుడు...!!

'కలర్స్' స్వాతిని పెళ్లిచేసుకుంటానంటూ వెంటపడుతున్న దర్శకుడు...!!

Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమయిన కలర్స్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయి ఆ కార్యక్రమం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న తార 'కలర్స్' స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా చిత్రంలోని నటనకు నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న స్వాతిని ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడట. సెల్వ రాఘవన్ కు మొదటి నుండీ స్వాతి అంటే చచ్చేంత ఇష్టం అట. అతను దర్శకత్వం వహించిన '7/g బృందావన్ కాలని' సినిమాలో తొలుత స్వాతినే కథానాయికగా అనుకున్నప్పటికీ ఆ సమయంలో ఆమె కృష్ణవంశీ వైపు మొగ్గుచూపి రాఘవన్ ను 'ఛీ' కొట్టింది.

ఆ తర్వాత కృష్ణవంశీ డేంజర్ సినిమా కాస్త ఫ్లాప్ అవడంతో ఆమె కెరీర్ ఆగిపోయింది. కానీ రాఘవన్ తిరిగి స్వాతిని 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రంలో వెంకటేష్ సరసన నాయికగా తీసుకోవాలని అనుకున్న అతని సరసన మరీ పిల్లదానిలా కనబడుతుందని అందరూ అభిప్రాయపడేసరికి ఆమె కోసమే ప్రత్యేకంగా చెల్లి పాత్రను సృష్టించాడు. దీంతో తన వీరాభిమాని అయిన సెల్వరాఘవన్ తన కోసం సృష్టించిన పాత్రను మహాప్రసాదంగా స్వీకరించింది.

ఆ తర్వాత రాఘవ పెద్ద దర్శకుడు అయిపోవడం, స్వాతి కూడా మంచి నాయికగా పేరుతెచ్చుకోవడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సెల్వ రాఘవన్ స్వాతిని తన తర్వాతి చిత్రానికి ఏరికోరి మరీ నాయికగా తీసుకున్నాడట. అంతే కాదు రాఘవ స్వాతిని రెండో వివాహం చేసుకోవాలని ఉవ్విలూరుతున్నాడట. ఇంతకు ముందు ఆయన సోనియా అగర్వాల్ ను పెళ్లి చేసుకుని, రెండేళ్లు సంసారం చేసి మొజుతీరిపోయాక వదిలేసాడు. సోనియాను వదిలేసినట్టు స్వాతిని వదిలెయ్యనని ఆయన మాటకూడా ఇస్తున్నాడట. కానీ స్వాతి మాత్రం ఇంకా మౌనం వహిస్తోందట. మరి ఆమె ఏ నిర్ణయం తీసుకోనుందో కాలమే సమాధానం చెప్పాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu