twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉచితంగా వాయిస్తున్న ఇళయరాజా

    By Bojja Kumar
    |

    భారత సంగీత ప్రపంచంలో, ముఖ్యంగా దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా. ఆయన అందించిన సంగీతం అమోఘం, అజరామరం. సేవా కార్యక్రమాలు చేయడంలోనూ, మంచిని ప్రోత్సహించడంలో ఇళయరాజా ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన.. గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన కలుగజేయడం కోసం తమిళంలో రూపొందుతున్న 'పచ్చై కూడై' చిత్రానికోసం ఆయన పారితోషికం తీసుకోకుండా బాణీలను సమకూరుస్తున్నారు. ఆర్.సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండువేల ఏళ్ళ క్రితం జీవించిన ఓ జంట ప్రేమ కథతో 'పచ్చైకూడై' తెరకెక్కుతోంది.

    ఈ సినిమాలో గిరిజన యువతిగా హీరోయిన్ నిత్యదాస్ ముఖ్య పాత్ర పోసిస్తుంది. అడవిలో చెట్లను నరకడానికి వెళ్ళిన యువకుడు నిత్యదాస్‌తో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలో అతని చేత చెట్లను నరకడాన్ని మాన్పిస్తుంది ఆ యువతి. సందేశంతో కూడిన ప్రేమ కథ ఇది. గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన కల్పిస్తూ, పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిని పంచేలా ఉండటంతో పారితోషికం తీసుకోకుండా పనిచేయడానికి ఇళయరాజా ముందుకొచ్చారని సెల్వరాజ్ అన్నారు. ఈ చిత్రం పకృతి ప్రేమికులను అలరిస్తుందని, పర్యావరణంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచేదిగా ఉంటుందని సెల్వరాజ్ తెలిపారు.

    English summary
    Tamil movie 'Vachai Kudai' directed by Selvaraj. Music composed by Ilayaraja. He worked with out remuneration for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X