»   » సినీ ఫక్కీలో....సీనియర్‌ నటి రాజశ్రీ నగల చోరీ, 15 లక్షలు వ్యాల్యూ

సినీ ఫక్కీలో....సీనియర్‌ నటి రాజశ్రీ నగల చోరీ, 15 లక్షలు వ్యాల్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగులో ఎన్నో క్లాస్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న రాజశ్రీ తన రిటైర్మెంట్ లైఫ్ ని చెన్నైలో గడుపుతున్నారు. తన కుమారుడుతో స్థానిక టి.నగర్,సోమసుంధరం వీధిలో నివశిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆమె నగలు సినీ ఫక్కీలో దొంగతనం కాబడ్డాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం రాజశ్రీ తన కొడుకు శ్రీనివాసన్ తో కలసి టీ.నగర్,పనక్కల్ పార్క్ సమీపంలో గల బ్యాంక్‌ లాకర్‌లో ఉంచిన తన బంగారు ఆభరణాలను తీసుకోవడానికి వెళ్లారు. లాకర్‌లో భద్రపరచిన బంగారు, వజ్రపు నెక్లెస్‌, రోలాక్స్‌ వాచ్‌ను తీసుకున్నారు.

Senior Actress RajaShree Jewellery has Robbed in Chennai

బయటకు వచ్చిన అనంతరం డబ్బు వితడ్రా చేసేందుకు శ్రీనివాసన్ ఏటీఎం కేంద్రం లోపలికి వెళ్లారు. నగలతో రాజశ్రీ కారులో కూర్చుకున్నారు. అదే సమయంలో ఒక అగంతుకుడు కారు వద్దకు వచ్చి పది రూపాయల నోట్లను కింద పడేసి కారులో ఉన్న రాజశ్రీతో అమ్మా కారు పక్కన డబ్బు పడి ఉంది తమరివా? అని అడిగాడు.

దీంతో తన డబ్బు కింద పడిందేమోనని భావించి కారు నుంచి కిందికి దిగారు.అంతలోనే ఆ అగంతుకుడి కారులోని నగల బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించాడు.కొంత దూరంలో అతని కోసం రెడీగా ఉన్న మరో వ్యక్తి మోటార్ సైకిల్‌పై ఎక్కి పారిపోయాడు.

Senior Actress RajaShree Jewellery has Robbed in Chennai

ఆ బ్యాగ్‌లో 15 లక్షల విలువైన బంగారు, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. ఊహించని ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన రాజశ్రీ కొంత సేపటికి తేరుకుని పాండిబజార్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Senior Actress RajaShree Jewellery has Robbed in Chennai

బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను,ఆ ప్రాంతంలోని బంగారు ఆభరణాల దుకాణాల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక కెమెరాలో నటి రాజశ్రీతో ఒక వ్యక్తి మాట్లాడిన దృశ్యం నమోదైంది. దాని ఆధారంగా పోలీసులు విచారణ తీవ్రవంతం చేశారు. అదే ప్రాతంలో సీబీఐ అధికారినంటూ ఒక వ్యక్తి కేరళా నగల షాప్ యజమాని నుంచి లక్షల విలువైన నగలను దోచుకుపోయాడు.అతను గురించి ఇంతవరకూ పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదన్నది గమనార్హం.

'మనుషులు మమతలు', 'శ్రీరామాంజనేయ యుద్ధం', 'పూజాఫలం', 'ఆరాధన', 'ఆత్మగౌరవం' వంటి చిత్రాల్లో నటించారు.

English summary
Senior Actress RajaShree Jewellers has Robbed by Thieves at chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu