twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటుడు రవిచంద్రన్ మృతి

    By Srikanya
    |

    సీనియర్ నటుడు రవిచంద్రన్(71) సోమవారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. తిరుచ్చి పవిత్ర జోసఫ్ కళాశాలలో పట్టభద్రుడైన రవిచంద్రన్ 1964లో కాదలిక్క నేరమిలైల చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. 1960-70 దశకంలో రవిచంద్రన్ ప్రముఖ హీరోగా వెలుగొందారు. ఆయన నటించిన అదే కన్గల్, ఇదయకమలం, గౌరీ కల్యాణం, కుమరిపెన్, మద్రాసు టు పాండిచ్చేరి, నాన్, ఉత్తరవిండ్రి ఉళ్లేవా, పుగుందపాటు చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి.

    దాదాపు 150 చిత్రాల్లో హీరోగా నటించాడు. ఎంజీయార్, శివాజీలతో సమానంగా పేరు తెచ్చుకున్న నటుడు. ఆయన నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. మైలాపూరులోని దేవకి ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూత్ర నాళాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండడంతో ఆరోగ్యం మరింత క్షీణించడంతో తేనాంపేటలోని అపోలో ఆసుపత్రికి చేర్చారు. సోమవారం రాత్రి రవిచంద్రన్ తుదిశ్వాస విడిచారు. మంగళవారం సాయంత్రం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి.

    English summary
    Ravichandran, who as a flamboyant young actor delighted audiences with his very first film, Kaadhalikka Neramillai, died late on Monday night at a city hospital. He was 69.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X