Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
విజయ్ సేతుపతి పై మండిపడుతున్న తమిళ సైన్యం
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. స్పిన్ మాయాజాలంతో మహా మహా బ్యాట్స్ మెన్ ను సైతం బోల్తా కొట్టించి .. పెవిలియన్ కి పంపిన ఘనత అతనిది. బౌలర్ గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకున్న మురళీధరన్ జీవిత కథ ఇప్పుడు వెండితెరకు ఎక్కుతోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను పోషించనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు ఇందులో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.ఇక ఈ చిత్రానికి '800' అనే టైటిల్ని నిర్ణయించారు. ఇందుకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. 800 చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ - వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. 800 మోషన్ పోస్టర్ లాంచ్ తరువాత షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది.

నెటిజనుల్లో కొందరు 800 సినిమా నిర్మాతలు సహా విజయ్ సేతుపతిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్న వైనం ప్రపంచానికి తెలిసిందే.
జాతి వివక్షకు పెట్టింది పేరైన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరకెక్కించడంపై తమిళనాడు వ్యాప్తంగా నిలసలను వెల్లువెత్తుతున్నాయి. మరి కాంట్రావర్శీలకు ఆమడదూరంలోనే ఉండే విజయ్ సేతుపతి ఈ వివాదం నుంచి ఏ విధంగా బయటపడతాడో చూడాలి.