»   » తెలుగులో పెద్ద ప్లాఫు...తమిళంలో పెద్ద హిట్

తెలుగులో పెద్ద ప్లాఫు...తమిళంలో పెద్ద హిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :విక్రమ్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన 'ఐ' తొలిరోజు నుంచి డివైడ్ టాక్ తో రన్ అయ్యింది. ఎక్కడా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోయినా కలెక్షన్ విషయంలో బాగుందనిపించుకుంది. అయితే తెలుగులో ఆ టాక్ ఫలితం ఇవ్వలేకపోయింది. ఇక్కడ పెట్టిన 34 కోట్ల పెట్టుబడిని వెనక్కి తేలేకపోయింది. కానీ తమిళంలో పరిస్దితి రివర్స్ లో ఉంది. అక్కడ రీసెంట్ గా 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం తొలి జెన్యూన్ హిట్ గా నిలిచింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అబ్రాడ్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ హైయిస్ట్ గ్రాసింగ్ రికార్డులలో మూడవ ప్లేసులో నిలిచింది. తమిళ ట్రేడ్ లెక్కల ప్రకారం ఇప్పటికి ఈ చిత్రం వంద కోట్లు గ్రాస్ తెచ్చుకుని పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్...75 కోట్లు దగ్గర ఆగిపోవటం,ధనుష్ రీసెంట్ చిత్రం అనేగన్ 50 కోట్లు కూడా క్రాస్ చేయకపోవటంతో శంకర్ చిత్రమే అక్కడ రికార్డు చిత్రంగా మిగిలిపోయింది.


భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు భాషల్లోనూ విడుదలైంది. కోర్టు కేసు, అప్పుల సమస్యతో ఈ చిత్రం విడుదల కావడం ఇంతకాలం జాప్యమైంది. ఈ కష్టాల నుంచి బయటపడి ఎట్టకేలకు చిత్రం సంక్రాంతి కానుకగా తెరపైకొచ్చింది.


Shankar's I Blockbuster In Tamil

అమెరికా, జపాన్‌, చైనా తదితర పలు దేశాల్లో సుమారు 2,500 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. తొలిసారిగా పాకిస్థాన్‌లో తమిళుల చిత్రం హిందీలో అనువాదమై విడుదలైంది. తమిళనాట మాత్రం సుమారు 400 థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కథానాయకుడు విక్రమ్‌ సరసన ఎమీజాక్సన్‌ నటించింది. మూడు సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్‌ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.


సన్నివేశాలకు తగ్గట్టుగా తన శరీర బరువును తగ్గించడం, పెంచడం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ చిత్రం కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన ఈ శ్రమ వృథా కాలేదని చిత్ర బృందం పేర్కొంది.


విక్రమ్‌ ఈ చిత్రంలో భిన్న పాత్రల్లో కన్పించారు. ఓ వైపు బాడీబిల్డర్‌ లింగేశ్వర్‌ పాత్ర కోసం బరువు పెరిగి... మళ్లీ గూనివాడి పాత్ర కోసం పూర్తిగా తగ్గారు. సైకిల్‌ హీరోయిన్‌గా మారడం, నోకియా ఫోన్‌ డ్రెస్‌లో కధానాయికను చూపించడం వంటి శంకర్‌ మార్క్‌ మాయాజాలం ఈ చిత్రంలోనూ చూడవచ్చు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించగా తెలుగులో మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ విడుదల చేసారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. అమీజాక్సన్‌ హీరోయిన్.


విక్రమ్‌ గెటప్‌లు, అమీజాక్సన్‌ అందచందాలు, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసారు. సురేష్‌గోపి, ఉపేన్‌పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌, కూర్పు: ఆంటోని, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

English summary
Bought for a whopping 34 crores, Vikram's I movie was a loss venture for many areas' buyers in Telugu. However, the film's Tamil version tells a totally opposite story.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu