For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రికార్డు : అమెరికాలోనూ 400 థియేటర్లలో....

  By Srikanya
  |

  చెన్నై : అమెరికాలోని అత్యధిక థియేటర్లలో 'ఐ' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విక్రం నటన, శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ సినిమా ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో కోలీవుడ్‌ సాధించని రికార్డును ఈ సినిమా విడుదల ద్వారా సాధించాలని భావిస్తున్నారని, అందుకోసం సుమారు 400 థియేటర్లలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది.

  విక్రమ్‌ హీరో గా నటించిన చిత్రం 'ఐ'. అమీ జాక్సన్‌ హీరోయిన్. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఆస్కార రవిచంద్రన్‌ నిర్మాత. ఆయన మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌తో కలసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తారు.

  Shankar's I to release 400 screens in USA Vikram

  నిర్మాత రవిచంద్రన్‌ మాట్లాడుతూ''హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా తెరకెక్కింది 'ఐ'. విడుదల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేవు. ముందుగా నిర్ణయించిన ప్రకారం సంక్రాంతి పండగను పురస్కరించుకొని 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకల్పనలో వచ్చిన గీతాలు శ్రోతల్ని అలరిస్తున్నాయి. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.

  'ఐ'విడుదలకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, పరస్పర అంగీకారంతో సమస్య పరిస్కారమైందని పిక్చర్‌ మీడియా హౌస్‌ పేర్కొంది. ఆస్కార్‌ రవిచంద్రన్‌ తమ వద్ద తీసుకున్న రుణం తిరిగి ఇప్పించాలని, అంతవరకు 'ఐ'సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ పిక్చర్‌ మీడియా హౌస్‌ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

  ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నాయి. ఈ విషయమై పిక్చర్‌ మీడియా విడుదల చేసిన ప్రకటనలో.. ఆస్కార్‌ రవిచంద్రన్‌కు, తమకు మధ్య ఉన్న వ్యాపార సమస్యలపై మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. 'ఐ'సినిమా విడుదలకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రకటించింది. అనుకున్నట్లు 'ఐ' చిత్రం పొంగల్‌కు విడుదలయ్యేలా తమ తరఫు నుంచి అన్నిరకాలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

  Shankar's I to release 400 screens in USA Vikram

  ఈ చిత్రంలో విక్రమ్‌ ఈ చిత్రంలో భిన్న పాత్రల్లో కన్పించనున్నారు. ఓ వైపు బాడీబిల్డర్‌ లింగేశ్వర్‌ పాత్ర కోసం బరువు పెరిగి... మళ్లీ గూనివాడి పాత్ర కోసం పూర్తిగా తగ్గారు. సైకిల్‌ హీరోయిన్‌గా మారడం, నోకియా ఫోన్‌ డ్రెస్‌లో కధానాయికను చూపించడం వంటి శంకర్‌ మార్క్‌ మాయాజాలం ఈ చిత్రంలోనూ చూడవచ్చు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించగా తెలుగులో మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ విడుదల చేస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. అమీజాక్సన్‌ హీరోయిన్.

  ఈ నెల 14న ఆస్కార్‌ ఫిలింస్‌, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు లభిస్తున్న స్పందన పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ''శంకర్‌ ప్రదర్శించనున్న మరో మాయాజాలం 'ఐ'. విక్రమ్‌ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఎక్కడకి వెళ్లినా ఈ చిత్రంలోని గీతాలే వినిపిస్తున్నాయి.

  చేతి వేళ్లకు పూలు పూయడం, ఒంటిపై సీతాకోక చిలుకలు వాలడం, ప్రపంచ వింతలను ఒకే పాటలో చూపించడం ఇవన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే సినీ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా టక్కున చెప్పేది శంకర్‌ సినిమాలో అని. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉంటాయి.

  ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. టీజర్‌లో విక్రమ్‌ను చూపించిన విధానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మరి ఇక సినిమాలో విక్రమ్‌ విశ్వరూపాన్ని చూడాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. యూట్యూబ్‌లో ఈ వీడియోకు హిట్లు 13 లక్షలకుపైగా దాటాయి.

  Shankar's I to release 400 screens in USA Vikram

  విక్రమ్‌ గెటప్‌లు, అమీజాక్సన్‌ అందచందాలు, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ''ని తెలిపాయి చిత్రవర్గాలు.

  సురేష్‌గోపి, ఉపేన్‌ పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌

  English summary
  Vikram's I movie to release 400 screens in USA.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X