»   » మాధవన్ తో త్రిష నిశ్చితార్థం

మాధవన్ తో త్రిష నిశ్చితార్థం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్, మాధవన్, త్రిష కాంబినేషన్ లో తమిళంలో ఓ చిత్రం రూపొందనుంది. కాగా..ఈ చిత్రం హాలీవుడ్ సెన్సేషన్ 'టైటానిక్" లా ఉంటుందట. ఈ చిత్ర కథ చాలావరకు షిప్ లో జరుగుతుందని సమాచారం. ఈ సన్నివేశాలను యూరోప్ లోని సాగరాల్లో చిత్రీకరించనున్నారట. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారవుతున్న ఈ చిత్రం కామిడీగా తయారవబోతోంది. ఇక ఈ చిత్రంలో త్రిష కమల్ హాసన్, మాధవన్, మధ్యన నలిగిపోతూ నవ్వించే పాత్రలో కనిపించబోతోంది. కాగా ఈ చిత్రంలో మాధవన్ తో త్రిష నిశ్చితార్థం జరుగుతుందట. కానీ త్రిష మాత్రం కమల్ హాసన్ తో ప్రేమలో పడుతుందట. ఇదిలా ఉంటే 'టైటానిక్" ముగింపు ట్రాజెడీగా ఉంటుంది. దర్శకుడు కెఎస్ రవి కుమార్ డైరక్షన్ లో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం త్రిష...ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu