శివాజీ 3డి: రజనీతో శ్రియ టోక్యో టూర్
చెన్నై: ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2007 రజనీకాంత్, శ్రియ జంటగా రూపొందిన చిత్రం 'శివాజీ'. ఈ చిత్రాన్ని త్రీడీ పార్మాట్ లోకి మార్చి మళ్లీ రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవిఎం సంస్థ ప్రసాద్ ఇఎఫ్‌ఎక్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్నారు.
ఈ చిత్రం త్రీడి వెర్షన్ ప్రీమియర్ షోను సెప్టెంబర్ 15న జపాన్ రాజధాని టోక్యోలో ప్రదర్శిస్తున్నారు. రజనీకాంత్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోకు రజనీకాంత్, శ్రియ కలిసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రియ చిత్ర బృందంతో త్వరలో కలవనుంది.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎస్‌ఎస్ గుహన్ మాట్లాడుతూ- 'శివాజీ' చిత్రాన్ని 2డి నుండి భారీ ఖర్చుతో త్రీడీ ఫార్మేట్‌లోకి మార్చామని, ఈ సినిమా విజయవంతమైతే 'రోబో' 'నరసింహ' వంటి చిత్రాలను కూడా త్రీడీ లోకి మార్చే ఆలోచన ఉందనీ, రజనీకాంత్ చిత్రాలను ఇదే విధంగా చేయాలన్న కోరిక ఉందని తెలిపారు.
రజనీకాంత్ హావభావాలు, ఐశ్వర్యారాయ్ అందచందాలు వెండితెరకు త్రీడీలో చూసే అదృష్టం త్వరలో లభించనుందనీ, ఈ చిత్రాలను కూడా త్రీడీలోకి మార్చనున్నామని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా ఆమె టొరంటొలో దీపా మెహత దర్శకత్వంలో వచ్చిన "మిడ్ నైట్ చిల్డ్రన్" చిత్ర ప్రిమియర్ ప్రదర్శన కోసం ఉన్నారు.


Click it and Unblock the Notifications











