»   » షాకింగ్ : బాంబులతో పేల్చేస్తామని మాస్ డైరక్టర్ కు వార్నింగ్, పోలీస్ కేసు పెట్టాడు

షాకింగ్ : బాంబులతో పేల్చేస్తామని మాస్ డైరక్టర్ కు వార్నింగ్, పోలీస్ కేసు పెట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూర్యతో సింగం వంటి హిట్ కొట్టిన దర్శకుడు హరి. ఈ దర్శకుడు కు తమిళ సినీ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఎస్ 3 చిత్రం(సింగం 3) చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ వార్త ఆయన సినిమాలకు సంభందించింది కాదు. ఆయన పర్శనల్ లైఫ్ కు చెందింది. ఈయనకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

అందుతున్న సమాచారం ప్రకారం హరి కు ప్రక్కింట్లో ఉండే కార్తిక్ , కుప్పు స్వామి అనే వాళ్లు ఆయన్ని బాంబులు వేసి మీ ఇంటిని పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన చెన్నైలోని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అఫీషియల్ గా వారిపై కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.

అసలు ఈ గొడవకు కారణం ఏమిటీ అంటే..పార్కింగ్ ప్లేస్ గురించి గొడవ అని తెలిసింది. ఈ విషయమై గత కొద్ది రోజులుగా గొడవ నడుస్తోందని, అయితే తాజాగా అది ముదరి మీ ఇంటిమీద బాంబులు వేసి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చేదాకా చేరిందని చెప్తున్నారు.

SHOCKER: Director Hari Receives Death Threat Over Parking Space!

హరి ఇంటి మీద బాంబులు విసిరి పేల్చేస్తామని మధ్యాహ్నం రెండు గంటలకు అన్నారని , అయితే కోపంలో ఏదో అన్నారని, లైట్ తీసుకున్నా, మళ్లీ సాయింత్రం ఏడుగంటలకు మళ్లీ హరి ఎదురుగానే అవే మాటలు రిపీట్ చేసారని తెలిసింది. దాంతో కోపం వచ్చిన హరి వీరిద్దరిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీస్ లు సెక్షన్ 75 క్రింద, న్యూసెన్స్ కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు.

ఇక హరి సినిమాల విషయానికి వస్తే...స్టార్ హీరోలతో మాస్ సినిమాలు తీసి మాస్ డైరక్టర్‌గా స్టార్ స్టేటస్‌ అందుకున్నారు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు డబ్బింగ్, రీమేక్‌ల రూపంలో తెలుగు ప్రేక్షకులనీ అలరించాయి. గతేడాది విశాల్‌ హీరోగా 'పూజ' సినిమా చేసిన హరి ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'సింగం' మూడో పార్ట్ పనుల్లో తలమునకలై ఉన్నారు.

తన రెండో సినిమా 'సామి'తో తొలిసారి విలక్షణ నటుడు విక్రమ్‌తో చేయి కలిపిన హరి అటుపై నాలుగో చిత్రమైన 'అరుల్' (తెలుగులో అఖండుడు) సినిమాకీ విక్రమ్‌తో పనిచేశాడు. ఆ తర్వాత తమ తమ సినిమాలతో బిజీ అయిపోయిన వీరిద్దరు దాదాపు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకే వేదికపైకి రానున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'సామి' సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టు దర్శకుడు హరి 'ఇరుముగన్' ఆడియో వేదికపై ప్రకటించారు. 'సింగం 3' పూర్తవ్వగానే 'సామి' సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

English summary
Director Hari, who is currently working on Suriya's S3, has received death threats from his neighbours over parking space, according to a report.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu