»   » డైరెక్టర్ లైంగిక వేధింపులు, సెట్లో బూతులు అందుకే షూటింగ్ కు ఎగ్గొట్టా

డైరెక్టర్ లైంగిక వేధింపులు, సెట్లో బూతులు అందుకే షూటింగ్ కు ఎగ్గొట్టా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తనని దర్శకుడు లైంగికంగా వేధించాడని, అందుకే షూటింగ్ కు రాలేకపోయానని ఇషారా నాయర్ ఫైనల్ గా చెన్నై టైమ్స్ ముందు నోరు విప్పింది. రెండు రోజులు క్రితం తమిళ హీరోయిన్ ఇషారా కు నిర్మాతలకు మధ్య వార్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ కు రాకుండా ఎగ్గొడుతోందని ఆమెను కోర్టుకు ఈడుస్తామన్నారు ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర దర్శకనిర్మాతలు.

అయితే దర్శకుడు షూటింగ్ సమయంలో తన పట్ల దారణంగా బిహేవ్ చేసాడని, అసభ్యంగా బిహేవ్ చేసాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా యూనిట్ సభ్యుల అందరి ముందు చాలా వల్గర్ గా బిహేవ్ చేసాడని,బూతులు మాట్లాడేవాడని వాపోయింది. లైంగికంగా వేధించటం మొదలెట్టాడని, అలాంటప్పుడు తను షూటింగ్ కు ఎలా రాగలను అని మీడియా ముందు ఏడ్చినంత పనిచేసింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ...దర్సకుడు కెవిన్ జోసెఫ్ నన్ను ఓ బూతు సీన్ లో నటించమన్నాడు.. పైగా నాతో వల్గర్ గా ప్రవర్తించాడు.. నేను 6 నెలల కాలానికి కాల్ షీట్లు ఇచ్చినా జస్ట్ రెండు రోజులే షూటింగ్ చేసారు. అందుకు..కారణమేమిటో అడిగితే ఏవో సాకులు చెబుతున్నారు అని ఇషారా నాయర్ తెలిపింది. కాగా ఈ ఆరోపణలను కెవిన్ జోసెఫ్ ఖండించాడు. తాను ఇదివరకే సారీ చెప్పానని, తన మూవీ త్వరగా కంప్లీట్ చేసే హడావుడిలో ఉన్నానని అన్నాడు.

నిర్మాతల వెర్షణ్ ఇదీ......స్లైడ్ షోలో..

ఎగ్రిమెంట్

ఎగ్రిమెంట్

తమిళ చిత్రాలు చదరంగవేట్టై, పప్పాళి చిత్రాల హీరోయిన్ ఇషారా. కేరళకు చెందిన ఈమె రీసెంట్ గా కల్లూరి చిత్రం ఫేమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్‌గా ఎగ్రిమెంట్ చేసుకుంది.

మూడు రోజులు చేసింది

మూడు రోజులు చేసింది

జోసెఫ్ లారెన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు రోజులు మాత్రమే నటించిన నటి ఇషారా ఆ తరువాత షూటింగ్ కు రాకుండా డుమ్మా కొట్టింది.

నిర్మాతలు వార్నింగ్

నిర్మాతలు వార్నింగ్

ఇషారా ప్రవర్తనకు విసిగి వేసారిన వారు ఆమెను కోర్టులో చూసుకుంటామని, వదలబోమని వార్నింగ్ ఇస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

'మా ఎండడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి నటి ఇషారాను నాలుగు లక్షల పారితోషికానికి 28-02-2016న ఒప్పందం కుదుర్చుకుని రూ.75 వేలు అడ్వాన్స్ చెల్లించాం.

ఎస్కేప్

ఎస్కేప్

ఆమెను 20 రోజుల కాల్‌షీట్స్ అడిగాం. అయితే రెండు రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొని ఆ తరువాత ఎస్కేప్ అయ్యారు.

దుబాయి,కేరళ

దుబాయి,కేరళ


మేం ఫోన్ చేస్తే తాను దుబాయ్‌లో ఉన్నాను, కేరళలో ఉన్నాను, వేరే షూటింగ్‌లో ఉన్నాను అంటూ చెబుతున్నారు.

వేరే కథ

వేరే కథ

మరోసారి దర్శకుడు ముందు చెప్పిన కథ వేరు ఇప్పుడు తీస్తున్న కథ వేరు అని సాకు చెప్తోంది.

మగగొంతు

మగగొంతు

మరో సారి ఆమెను ఫోన్‌లో సంప్రదించగా ఎవరిదో మగ గొంతు పిలుస్తాను ఉండండి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

మెసేజ్ పెట్టాం

మెసేజ్ పెట్టాం


దీంతో కథలో ఏమైనా మార్పులు చేయడానికైనా సిద్ధం అని మెసేజ్ పెట్టగా ఇదుగో వస్తున్నా, అదుగో వస్తున్నా అని చెప్పి షూటింగ్‌కు రాలేదు.వేరే దారి లేక మేము కేరళ నడిగర్ సంఘాన్ని ఆశ్రయించాం.

నిర్మాతల గిల్డ్

నిర్మాతల గిల్డ్

వారికి ఇషారా సరైన సమాధానం ఇవ్వలేదట. మరో ప్రయత్నంగా నిర్మాతల గిల్డ్‌కు చెందిన జాగ్వుర్‌తంగం ద్వారా ఇషారాతో మాట్లాడించాం. ఆయనకు సరైన బదులు ఇవ్వలేదు.

కేరెలెస్

కేరెలెస్


ఇక లాభం లేదని పత్రికలకెక్కుతామనీ, కోర్టుకెళ్లతామనీ చెప్పాం. అందుకామె వెళ్లండి అంటూ చాలా కేర్‌లెస్‌గా బదులిచ్చారు. ఇలాంటి వారిని నమ్మి మాలాంటి నిర్మాతలు కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాం. మా పెట్టుబడులతో ఆడుకునే ఇషారాను కోర్టుకు ఈడుస్తాం' అని ఎంగడా ఇదుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర నిర్మాతలు తెలిపారు.

English summary
Actress Ishaara Nair of Sathuranga Vettai fame, who was accused of absconding without completing her shooting assignment, by the makers of her upcoming film Engada Irundheenga Ivvalavu Naala, has finally opened up on the controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu