»   » షాకింగ్ ! సినిమా మొత్తం ఇంటర్నెట్ లో ప్రత్యక్ష్యం

షాకింగ్ ! సినిమా మొత్తం ఇంటర్నెట్ లో ప్రత్యక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రిలీజ్ అయ్యాక టోరెంట్స్ ద్వారా మరొక దాని ద్వారా పైరసీ జరుగటం ద్వారా చిత్ర పరిశ్రమ విపరీతంగా నష్టపోతోంది. అయితే ఈ రోజు రిలీజ్ అనగా అంతకు ముందు రోజే సినిమా మొత్తం ఇంటర్నెట్ లో ప్రత్యక్ష్యం అయితే..అలాంటిదే అజిత్ తాజా చిత్రం ‘ ఎన్నైఆరిందాల్‌' కి జరిగిందని చెన్నై వర్గాల భోగట్టా. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో అజిత్‌, అనుష్క, త్రిషలు కలిసి నటిస్తున్న తమిళ చిత్రం ‘ ఎన్నైఆరిందాల్‌' . ఈ రోజు ఈ చిత్రం విడుదల అవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రానికి సంభందించిన ఆన్ లైన్ క్యామ్ ప్రింట్ కు సంభందించిన స్క్రీన్ షాట్స్ వి సోషల్ మీడియాలో కనపడటం అభిమానులను కంగారు పెడుతున్నాయి. అయితే దర్శకుడు, నిర్మాత మాత్రం అటువంటిదేమీ జరగలేదని అంటున్నారు. చాలా టైట్ సెక్యూరిటీతో ప్రతీ సీన్ ని కాప్చర్ చేసామని, అది డూపిల్ కేట్ ప్రింట్ అయ్యి ఉండవచ్చుని అంటున్నారు. మరో ప్రక్కన అజిత్ వీరాభిమానులు మాత్రం పైరసీని ఎంకరేజ్ చేయవద్దని, థియోటర్ లో బిగ్ స్కీన్ మీద మాత్రమే తమ హీరో చిత్రం చూడాలని పిలుపు ఇచ్చారు.

చిత్రం విషయానికి వస్తే...

SHOCKER! Watch Ajith's Yennai Arindhaal Now On Internet!

అజిత్‌ హీరోగా నటిస్తున్న 'ఎన్నై అరిందాల్‌' చిత్రానికి ముగ్గురు దర్శకత్వం వహించినట్లు తెలిసింది. ఈ చిత్ర ప్రధాన దర్శకుడు గౌతం మీనన్‌. గౌతం మీనన్‌ మాట్లాడుతూ '' ఈ చిత్రం అజిత్‌ కోసమే సిద్ధం చేశా. చిత్రీకరణ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ కారణంగా నాతోపాటు దర్శకులు శ్రీధర్‌ రాఘవన్‌, త్యాగరాజ కుమారరాజ పనిచేస్తున్నారు. వారిని సాయం కోరగానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టార''అని తెలిపారు.

అజిత్‌ మాట్లాడుతూ.. '' ఇది ఎప్పటిలాగానే నాకోసం తయారైన చిత్రంలా ఉండకూడదు. ప్రత్యేకించి గౌతమ్‌ మీనన్‌ తరహాలో రూపొందించిన సినిమాలా కనిపించాలన్నదే నా అభిమతము''అని వివరించారు. తెలుగులో ఈ చిత్రం ‘ఎంతవాడుగానీ'..అనే టైటిల్ తో విడుదల అవుతుందంటున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు.

చిత్రం వివరాల్లోకి వెళితే..

స్టార్‌ హీరో అజిత్‌, గౌతమ్‌ మీనన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ ఎంతవాడుగానీ '. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ ఐ ', ‘ లింగ ' చిత్రాల తరహాలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది.

SHOCKER! Watch Ajith's Yennai Arindhaal Now On Internet!

దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ - ‘‘ ఇందులో మూడు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో అజిత్‌ నటిస్తున్నారు. అనుష్క ఫారిన్‌ నుంచి వచ్చిన మోడ్రన్‌ గర్ల్‌గా నటిస్తుండగా, త్రిష సంప్రదాయ కుంటుంబం నుంచి వచ్చిన క్లాసికల్‌ డాన్సర్‌గా చేస్తున్నారు. ఇంతకుముందు తమిళ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన అరుణ్‌ విజయ్‌ ఈ చిత్రంలో అజిత్‌కి ఈక్వెల్‌గా వుండే నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన సరసన పార్వతి నాయర్‌ నటిస్తున్నారు. ఆశిష్‌ విద్యార్థి, సుమన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. హారీస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో ఏడు పాటలు వుంటాయి. అజిత్‌ కాంబినేషన్‌లో నేను చేస్తున్న ఈ సినిమా మరో సెన్సేషనల్‌ కమర్షియల్‌ ఫిలిమ్‌ అవుతుందన్నారు.''

నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ- ‘‘ ఎనిమిది నెలలుగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగింది. చెన్నై, రాజమండ్రి, మలేషియా వంటి డిఫరెంట్‌ ప్లేసెస్‌లో షూటింగ్‌ చేశాము. అలాగే జోధ్‌పూర్‌, జైపూర్‌, పెల్లింగ్‌, గ్యాంగ్‌టక్‌ వంటి ప్రదేశాల్లో అజిత్‌పై చిత్రీకరించిన పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్‌ అయిన తమిళ చిత్రం టీజర్‌కి యూ ట్యూబ్‌లో ఇప్పటికే 10 లక్షల హిట్స్‌ వచ్చాయి. ఎన్‌.టి .రామారావు గారి సూపర్‌హిట్‌ సాంగ్‌ అయిన ‘ఎంతవాడు గానీ, వేదాంతులైన గానీ' అనే పాటలోని పల్లవిని తీసుకొని ఎంతవాడు గానీ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టడం జరిగింది.'' అన్నారు.

English summary
Ajith Kumar starrer, Gautham Vasudev Menon's 'Yennai Arindhaal' is the most anticipated flick which is going to hit the theatres tomorrow on Feb 5. But sources are telling yet another shocking story. According the latest reports, the 55th movie of Thala Ajith is now available on internet before the release.
Please Wait while comments are loading...