»   »  ఆ మోజులో పడతే ...శ్రియ పై నిషేధం

ఆ మోజులో పడతే ...శ్రియ పై నిషేధం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shreya
సౌత్ లో నెంబర్ వన్ స్ధానానికి పోటీపడుతున్న శ్రియ పై తాజాగా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(TFPC) నిషేదం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ముందస్తుగా ఆ విషయాన్ని ఆమెకు నోటీస్ ద్వారా తెలియచేసారని విశ్వసనీయంగా తెలుస్తోంది.హఠాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే శ్రియ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుని ఆ బిజీలో ఇక్కడి నిర్మాతలను ఇబ్బంది పెడుతోందనేది వారి కంప్లైయింట్ .

తాజాగా ధనుష్ హీరోగా ప్రారంభం కానున్న సినిమాకిచ్చిన డేట్స్ ని ఫారెన్ ఫిల్మ్ కి వాడటంతో ఈ గొడవ బయిలుదేరింది. ఆ చిత్రం నిర్మాత మురుగేషన్ తాను అడ్వాన్స్ ఇచ్చి ఎగ్రిమెంట్ రాయించుకున్నా ఇలా ఇబ్బంది పెడుతోందని కొన్ని కోట్ల రూపాయలు ఈ షూటింగ్ జరగక పోతే లాసవుతానని ఫైనాన్సియర్స్ కి సమాధానం చెప్పటం కష్టమని అందుకే ఈ కంప్లైయింట్ చెయ్యాల్సివచ్చిందని వివరిస్తున్నాడు. నిజానికి రజనీకాంత్ తో చేసిన బాస్ సినిమా తో సౌత్ లో ఆమె హాట్ గా మారిపోయింది. దాంతో విక్రమ్ సరసన కందసామి (మల్లన్న) చిత్రంలోనూ, కె.ఎస్.రవికుమార్ జగ్గుభాయ్ చిత్రంలోనూ,జెమినీ సంస్ధ నిర్మించే చిత్రంలోనూ, కమల్ మర్మయోగి లోనూ ఆమె వరస ఆఫర్స్ సంపాదించింది.

అలాగే హాలీవుడ్ లో ఎం.జి.యం వంటి పెద్ద సంస్ధ నిర్మిస్తున్న 'The Other End Of The Line',దీపా మెహతా దర్శకత్వంలో 'What's Cooking Stella?' రెడీ అవుతున్నాయి.అయితే శ్రియ హాలీవుడ్ మోజులో పడి ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఫలితం చాలా దారుణంగా ఉంటుంది అని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అయితే వెంటనే తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు చర్య తీసుకోకుండా ఆగటానికి ఆమె పెద్ద బ్యానర్స్ లో కమిటియ్యి ఉండటం కారణం. నిషేధం పెడితే వారంతా సఫర్ అవుతారని ఈలోగా ఆమె అపాలజీ చెప్పి తిర్గి పనిలో పడమని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X