»   » శ్రమని దోచేస్తున్నారు...శ్రియ ఆవేదన

శ్రమని దోచేస్తున్నారు...శ్రియ ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ కష్టాన్ని,శ్రమని దోచేస్తున్నారంటూ హాట్ హీరోయిన్ శ్రియ వాపోతోంది. తాజాగా ఆమె నటించిన 'జగ్గుభాయ్‌' విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చింది.అలాగే పైరసీ సీడీలు రిలీజై సంచలనం రేపింది. దాంతో ఈ విషయమై స్పందిస్తూ..."సినిమా కోసం నిర్మాతలు ఎన్నో కోట్లు ఖర్చుపెడతారు. ఇలా ఎన్నో రోజులు ఎంతోమంది శ్రమ ధారపోస్తేనే సినిమా తయారవుతుంది. మా శ్రమని చిటెకెలో 'పైరసీ' చేసేయడం అన్యాయం. ఇలా చేయడాన్నే 'శ్రమ దోపిడీ' అంటారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సినిమా పరిశ్రమకన్నా పైరసీ పరిశ్రమ పెద్దదవుతుంది. అలా జరగకూడదు' అంటోంది శ్రియ. ప్రస్తుతం శ్రియ...పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే ఇటీవలే విడుదలైన తమిళ చిత్రం 'జగ్గుభాయ్‌' మంచి పేరు తెచ్చుకుంది. మలయాళంలో పృథ్విరాజ్ సరసన 'పోకిరి రాజా' అనే చిత్రంలో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu