»   » 22 లక్షలు శ్రియకి ఇప్పించిన పవన్ కళ్యాణ్?

22 లక్షలు శ్రియకి ఇప్పించిన పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో ఐటం సాంగ్ చేసిన శ్రియ..దానికి గానూ ఇరవై రెండు లక్షలు ఛార్జ్ చేసింది. దర్శక, నిర్మాతలకు శ్రియపై పెద్దగా ఆసక్తి లేక వద్దంటే..పవన్ పట్టుబట్టి పెట్టించాడని సమాచారం. అయితే శ్రియ మాత్రం ఈ ఐటం సాంగ్ చేయటానికి కారణం కేవలం ఎఆర్ రహమాన్ అని చెప్తోంది. ఆ సాంగ్ సూపర్ హిట్టు అవుతుందనిపించే చేసానంటోంది. అంతేతప్పు డబ్బు ఎప్పుడూ తనకు ముఖ్యం కాదని రీసెంట్గా చుకుబుకు అనే తమిళ చిత్రం ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చింది. ఇక ఈ పాటని మూడు రోజులు పాటు అందమైన సెట్స్ లో చిత్రీకరించారు. బాలీవుడ్ డిజైనర్ నీత లుల్లా ఈ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. ఈ పాట పులి చిత్రానికి మరింత వన్నె తెస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

అలాగే ఖాళీగా ఉండి శ్రియ ఐటం సాంగ్స్ చేస్తున్నారనే వారికి తగిలేటట్లుగా...పులి చిత్రంలో తాను చేస్తున్న ఐటం సాంగ్ ని కొంతమంది అవకాశాలు లేక చేస్తున్నట్లుగా భావించి మాట్లాడుతున్నారని అది తప్పని శ్రియ చెప్పుకొచ్చింది. సినిమాల్లో క్రేజీ హీరోయిన్స్ స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంలో తప్పుందని నేననుకోను. ఒకే హీరోయిన్‌పై సినిమాలోని పాటలన్నీ చిత్రీకరిస్తే చూసే రోజులు పోయాయి. అందుకే దర్శకనిర్మాతలు తమ చిత్రాల్లో ఒకరికంటె ఎక్కువమంది హీరోయిన్లను తీసుకుంటున్నారు. అంతేకాదు..నాలాంటి క్రేజీ హీరోయిన్లతోనూ స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేయిస్తున్నారు. అందులో తప్పుపట్టడానికేమీ లేదని నా అభిప్రాయం సమర్ధిస్తోంది శ్రియ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu