»   » మూడ్నెల్లు కలసి ఉంటే సంభంధం ఉన్నట్లేనా? శ్రియ

మూడ్నెల్లు కలసి ఉంటే సంభంధం ఉన్నట్లేనా? శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద బడ్జెట్‌ సినిమాలు అన్నాక దాదాపు మూడ్నెల్లు పని చేయాల్సి వస్తుంది. అంత మాత్రాన తోటి ఆర్టిస్టులతో సంభందం అంటగట్టేస్తారా. అయినా కలిసి పనిచేయాల్సిన సమయంలో ఏమీ మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చోవడం బాగోదు కదా..అయినా ఎదుటివారి అభిరుచులు మనవాటితో మ్యాచ్ అయినప్పుడు ప్రెండ్స్ గా ఉంటే తప్పేంటి?.. స్నేహంగా మాట్లాడం కూడా తప్పేనా?...ప్రతి దాన్నీ భూతద్దంలో చూడకూడదు. నా హృదయం ఎప్పుడూ తెల్లకాగితం లాంటిది. నేనేంటో నాకు తెలుసు' అంటూ మండిపడుతోంది శ్రియ. హీరోలతో మీరు కాస్త చనువు ఎక్కువుగా ఉంటారంటూ వినిపిస్తోంది అని మీడియావారు అడిగితే దానికి ఇలా శ్రియ స్పందించింది. ఇక శ్రియ ప్రస్తుతం కొమురం పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే డాన్ శీను చిత్రంలో రవితేజ సరసన చేస్తోంది. రవితేజ, శ్రియ కాంబినేషన్లో గతంలో భగీరధ చిత్రం వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu