»   » శ్రియకు నిర్మాతల మండలి...ఐదు లక్షల ఫైన్

శ్రియకు నిర్మాతల మండలి...ఐదు లక్షల ఫైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అడ్వాన్స్ తీసుకుని సినిమా డేట్స్ ఎడ్జెస్టు చేయనందుకు తమిళ నిర్మాతల మండలి శ్రియకు అసలు, వడ్డీతో కలిపి 15లక్షలు తక్షణమే చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ కంప్లైంట్ పూర్వా పరాలు ఇలా ఉన్నాయి.'పొల్లాదవన్‌"(తెలుగులో కుర్రాడు) అనే సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన తమిళ నిర్మాత కథిరేశన్‌ శ్రియకు సినిమా చేయాలంటూ 10లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అప్పటికి అది అందుకున్న శ్రియ తర్వాత ఆ నిర్మాతకు డేట్స్ ఇవ్వలేదు. సరికదా విషయం తేల్చకుండా తిప్పించుకోసాగింది. దాంతో విసిగి వేసారిన ఆయన తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసారు. సినిమా చేయకపోయినా ఫర్లేదు తన అడ్వాన్స్‌ తనకు ఇవ్వమని కోరితే శ్రియ వేపు నుంచి స్పందన లేదని ఆ కంప్లైంట్ లో వివరించారుచ. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట అసలు, వడ్డీ కలిపి 15లక్షలు శ్రీయ సదరు నిర్మాతకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చారు. శ్రియ ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక శ్రియ ప్రస్తుతం పవన్ కళ్యాణ్...పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే రవితేజ హీరోగా రూపొందుతున్న 'డాన్‌ శీను'లోనూ హీరోయిన్ గా చేస్తోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu