»   » త్రిషకు టెండర్ పెట్టిన శ్రియ..శ్రియకు చెక్ పెట్టిన జీవా..

త్రిషకు టెండర్ పెట్టిన శ్రియ..శ్రియకు చెక్ పెట్టిన జీవా..

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఒకళ్ల సినిమాని మరొకళ్లు కొట్టేయడం అప్పుడప్పుడు మన సినిమా రంగంలో జరుగుతూనే వుంటుంది. కారణాలు ఏమైనా మొదట్లో ఒకర్ని ఎంపిక చేసుకున్నాక...మరొకళ్లు ఆ స్థానంలోకి వస్తుంటారు. ఇప్పుడు త్రిష విషయంలో కూడా అలాగే జరిగింది. 'హీరో' అనే మలయాళ సినిమాలో ముందుగా త్రిషాని కథానాయికగా బుక్ చేశారు. అయితే, ఆమె స్థానంలో ఇప్పుడు శ్రియా వచ్చి చేరింది. త్రిషాకి డేట్స్ సమస్య రావడం వల్ల ఈ సినిమా చేయలేకపోయిందని అంటున్నారు. అయితే, పారితోషికం విషయంలో తేడా రావడం వల్లే త్రిషని డ్రాప్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రియాకి మలయాళంలో ఇది మూడో సినిమా. పృద్వీరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలవుతుంది.

  కాగా 'రంగం" సినిమాతో తెలుగునాట మంచి పేరు తెచ్చుకున్న జీవా తమిళంలో అయితే వరుస విజయాలతోదూసుకుపోతున్నాడు. అతని సరసన రౌద్రం సినిమాలో నటించిన శ్రియ అటు తమిళం, ఇటు తెలుగు రెండిట్లోనూ ఇదే సినిమాతో తిరిగి సత్తా చాటుకోవాలని చూసింది అయితే ఫామ్ లో ఉన్న జీవా కూడా శ్రియకి ప్లాపే ఇచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో శ్రియ భోరుమంటోంది. తెలుగులోకి రౌద్రం పేరుతోనే అనువాదమైన ఈ చిత్రం ఇంకా ఇక్కడ విడుదల కాలేదు. దడ, కందిరీగ ఉన్నాయని ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు తమిళంలో మంచి టాక్ లేకపోవడంతో తెలుగులో విడుదలయ్యే సూచనలు కనిపించడంలేదు.

  English summary
  Kollywood hot-face Shriya Saran has stepped in place of reigning diva Trisha for a Mollywood movie. Shriya stars opposite neighboring state Kerala’s super hero Prithviraj in a movie titled Hero. We are told that even though Trisha was the first choice, the actress could not assign dates with her schedule already jam-packed. Hence Shriya jumped in for the offer without much delay.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more