Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నాన్న పై కూతురి కామెంట్స్: కమల్ పొలిటికల్ ఎంట్రీ పై శృతీ హసన్ వ్యాఖ్యలు
ప్రఖ్యాత నటుడు కమల్ హసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. కొన్నాళ్ళ కిందటే చెన్నైలో అభిమానులను కలిసిన కమల్.. తన బర్త్ డే లోపు ఓ ప్రణాళికను ప్రిపేర్ చేస్తున్నట్లు సంకేతాలు అందించారు. ఈ ఏడాది నవంబర్ 7న కమల్ తన 63వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజునే కమల్ తన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని తాజా సమావేశం ప్రకారం ఆయన సన్నిహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కమల్ రాజకీయ ప్రవేశం
అందరూ అనుకున్న విధంగానే.. ఆ మధ్య జరిగిన భేటీలో తన రాజకీయ ప్రవేశం గురించి కమల్ అభిమానులతో చర్చించారు. అంతేకాదు. పార్టీ జెండా అజెండా అలాగే పార్టీ గుర్తు ఇలా అనేక విషయాలపై అభిమాన సంఘాలకు వివరించారు. తదననంతరం అభిమానుల అభిప్రాయాలను కమల్ తెలుసుకున్నారు.

ఖుష్బూ మద్ధతు
ఈ నేపథ్యంలో సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ.. కమల్‌కు మద్ధతు ప్రకటించింది. ‘అవినీతికి వ్యతిరేకంగా కమల్‌హాసన్ స్పందనను స్వాగతిస్తున్నా. కమల్ రాజకీయాల్లోకి వస్తారని కొంత కాలంగా వార్తలు వినబడుతున్నాయి. నిజంగా నా స్నేహితుడు కమల్ రాజకీయాల్లోకి వస్తే నా మద్ధతు ఆయనకి ఉంటుంద'ని ట్వీట్ చేశారు ఖుష్బూ. ఇక మిగతా వర్గాలనుంచి విమర్శలూ, మద్దతులూ వస్తూనే ఉన్నాయి.

తండ్రికి ఫుల్ సపోర్ట్
తాజాగా కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన కూతురు హీరోయిన్ శ్రుతి హాసన్ స్పందించింది. రాజకీయాల్లో తన తండ్రికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్పింది. తన తండ్రి నిజాయితీపరుడని - ఆయన తప్పక రాజకీయాల్లో రాణిస్తారని తెలిపింది. చెన్నైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న శృతిహాసన్ కమల్ రాజకీయ అరంగేట్రంపై తొలిసారి మీడియాతో మాట్లాడింది.

నిజ జీవితంలో కూడా గొప్ప నాయకుడు
తన తండ్రి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని శ్రుతి హాసన్ చెప్పింది. సినిమాల్లోనే కాదు...నిజ జీవితంలో కూడా ఆయనో గొప్ప నాయకుడని పాలిటిక్స్ లో తప్పక రాణిస్తారని చెప్పింది. తన తండ్రి నిజాయతీపరుడని - అన్ని విషయాల్లో ముక్కు సూటిగా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారని కితాబిచ్చింది.

ఆయన చేసే ప్రతి పనిలో నా మద్దతు
ఆయన ఏ పని చేసినా బాగా ఆలోచించి విశ్లేషించిన తర్వాతే చేస్తారని చెప్పింది. ఆయన చేయబోయే పనిపై ఒక స్పష్టమైన అవగాహన ఉన్నపుడే దానిని ప్రారంభిస్తారని తెలిపింది. ఆయన చేసే ప్రతి పనిలో తన మద్దతు తప్పక ఉంటుందని చెప్పింది. శభాష్ నాయుడు సినిమాలో తండ్రీ కూతుళ్లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

గౌతమి బీజేపీ కి అనుకూలం
కాగా కమల్ కు రాజకీయాలలో మద్దతు ఇచ్చే విషయంలో నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో సహజీవనం చేసినంత మాత్రాన రాజకీయాల్లో ఆయనకు మద్దతు ఇవ్వాలని లేదని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. అసలు గౌతమికీ, కమల్ కీ ఈ విషయం లోనే గొడవ వచ్చిందన్నది తాజా టాక్. మొదటినుంచీ గౌతమి బీజేపీ కి అనుకూలంగానే ఉంది.