»   » తమిళ 'బాహుబలి' లో శ్రుతిహాసన్, పూర్తి వివరాలు

తమిళ 'బాహుబలి' లో శ్రుతిహాసన్, పూర్తి వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : కోలీవుడ్‌ దర్శకుడు, ఖుష్భూ భర్త సుందర్‌.సి భారీ బడ్జెట్‌తో 'సంఘమిత్ర' అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ బేస్డ్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోలుగా ఆర్య, జయం రవిలు కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, డైరక్టర్‌ గ్రాఫిక్‌ పనుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. బాహుబలి రేంజిలో ఈ చిత్రం భారీ ఎత్తున గ్రాఫిక్స్ తో నిండి ఉండబోతోందని తెలుస్తోంది. 350 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు.


ఇక బ్రహ్మాండమైన హిస్టారికల్ బేసెడ్ ఫాంటసీ చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్ ఒక భాగం కానుందని తెలుస్తోంది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్నారు. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్‌షీట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్‌ జయంరవి, ఆర్యలను హీరోలుగా ఎంపిక చేశారు.

Shruti Haasan bags Kollywood's 'Baahubali'

అదేవిధంగా వారికి జంటగా బాలీవుడ్‌ భామలు దీపికాపడుకునే, సోనాక్షిసిన్హాలను నటింపజేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఒక హీరోయిన్ గా టాప్‌ హీరోయిన్లలో ఒకరైన శ్రుతీహాసన్ ను ఎంపిక చేసిందనే వార్త ఆమె అభిమానులను ఆనందపరుస్తోంది. ఆ ఏడాది రెండవ భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న సంఘమిత్ర చిత్రానికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, డైరక్టర్‌ గ్రాఫిక్‌ పనుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. మూవీలో గ్రాఫిక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉండటంతో ఆ పనిమీద దర్శకుడు అమెరికాకు వెళ్లారట. ఇక ఈ మూవీ కోసం ఇప్పుడు లొకేషన్ల వేట జరుగుతుండగా, ఇటీవలే సినిమాకు సంబంధించిన సెట్‌ వేసేందుకు ఫిలిం సిటీని చిత్రయూనిట్‌ సందర్శించినట్లు టాక్‌. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్‌ జరగనుండగా, మరోవైపు నటీనటులను కూడా పరిశీలిస్తున్నాడు సుందర్‌.సి.

ఇక శ్రుతిహాసన్ కెరీర్ ఇప్పుడు మంచి స్పీడులో ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆ బ్యూటీ సూర్యకు జంటగా నటించిన సీ-3 మంచి విజయం సాధించింది. మరో ప్రక్క తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శబాష్‌నాయుడు చిత్రంలో తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు.

ఇది తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అన్నది గమనార్హం. హిందీలో బెహెన్ మోగి తెరి అనే చిత్రంతో పాటు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంఘమిత్ర అనే హిస్టారికల్‌ మూవీలో నటించడానికి సిద్ధం అవుతూండటం ఆనందమే కదా.

English summary
Shruti Haasan has bagged big-ticket movie, titled as 'Sangamithra', a fantasy historical directed by Sundar C, Kollywood is coming out with its own mega-budgeted movie. Starring Jayam Ravi and Arya as heroes, it has music by none other than AR Rahman himself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu