Kamal Haasan ఆరోగ్య పరిస్థితిపై శృతిహాసన్ అప్‌డేట్.. ట్వీట్ చేసి ఏం చెప్పారంటే?

భారతీయ సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడు, మక్కల్ నీది (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ కరోనావైరస్ బారిన పడటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా పర్యటన తర్వాత కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. అయితే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మీడియాకు వివరించారు.

కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి బాగుంది. త్వరలోనే ఆయన బయటకు వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోలన పడొద్దు. మీ ప్రార్థనలు ఫలించడం వల్లే ఆయన త్వరగా కోలుకొన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు అని శృతిహాసన్ తెలిపారు. శృతిహాసన్ అప్‌డేట్‌తో అభిమానులు ఉపశమనం పొందారు. శృతి చేసిన ట్వీట్‌‌కు అభిమానులు రిప్లై ఇస్తూ థ్యాంక్యూ చెప్పారు.

Shruti Haasan gives Kamal Haasans Health update on Coronavirus positive

కమల్ హాసన్ తన ఆరోగ్యం గురించి నవంబర్ 22వ తేదీన ప్రకటనను విడుదల చేసి తాను కరోనావైరస్ బారిన పడ్డానని వివరించారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌కు వెళ్లాను. కొంచెం దగ్గు రావడం, జ్వరంగా ఉండటంతో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇంకా కరోనావైరస్ మహమ్మారి ఇంకా వదిలిపోలేదనే విషయం స్పష్టమైంది. కాబట్టి ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి అని కమల్ కోరారు. ప్రస్తుతం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

కమల్ హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం విక్రమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాజిల్ ఫహద్ కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా ఇండియన్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం కొద్దికాలంగా వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X