»   » బాహుబలితో పోల్చొద్దు.. సంఘమిత్ర అద్భుతమైన చిత్రం.. శృతిహాసన్

బాహుబలితో పోల్చొద్దు.. సంఘమిత్ర అద్భుతమైన చిత్రం.. శృతిహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సినిమాపై అందాలతార శృతిహాసన్ ప్రశంసల వర్షం కురపించింది. సినిమా చరిత్రలో అలాంటి చిత్రాన్ని మళ్లీ రూపొందించలేమని ఆమె స్పష్టం చేసింది. 8వ శతాబ్దం నాటి రాజుల కథతో రూపొందిస్తున్న సంఘమిత్ర అనే చిత్రంలో శృతిహాసన్ టైటిల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్‌ను ఇటీవల 70వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతిహాసన్ విదేశీ మీడియాతో మాట్లాడుతూ బాహుబలితో ఈ చిత్రాన్ని పోల్చవద్దు అని ఆమె తెలిపింది.

సంఘమిత్ర సవాల్‌తో కూడుకొన్నది..

సంఘమిత్ర సవాల్‌తో కూడుకొన్నది..

శత్రువుల దాడికి గురైన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటమే సంఘమిత్ర చిత్ర కథ. ఈ చిత్రం కోసం యుద్ధానికి సంబంధించిన కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి విద్యలను నేర్చుకొన్నాను. సంఘమిత్ర పాత్ర పోషించడం సవాల్‌తో కూడుకొన్నది. పలు ట్విస్టులు, అనేక కోణాలు ఉన్న ఈ ఫాంటసీ చిత్రం అని శృతిహాసన్ వెల్లడించింది.

చిత్ర యూనిట్‌కు గర్వంగా..

చిత్ర యూనిట్‌కు గర్వంగా..

తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరవ్వడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. కేన్స్‌లో సంఘమిత్ర ప్రమోషన్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేయడం నాకు, చిత్ర యూనిట్‌కు గర్వంగా ఉంది అని శృతి చెప్పింది. పలు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో జయం రవి, ఆర్య తదితరులు నటిస్తున్నారు.

స్ఫూర్తిని ఇచ్చే పాత్ర..

స్ఫూర్తిని ఇచ్చే పాత్ర..

సంఘమిత్ర పాత్ర చాలా ప్రభావవంతమైంది. వందల ఏళ్ల క్రితం నాటి మహిళ పాత్ర అయినా ప్రస్తుత జనరేషన్‌కు స్ఫూర్తిని ఇచ్చేలా ఉంటుంది. సంఘమిత్ర పాత్ర అద్భుతంగా ఉంటుంది అని శృతి పేర్కొన్నది.

బాహుబలి2తో పోలీకలు ఉండవు..

బాహుబలి2తో పోలీకలు ఉండవు..

బాహుబలి సినిమాకు సంఘమిత్రకు ఎలాంటి పోలికలు ఉండవు. రెండు వేర్వేరు కథలు. బాహుబలి కారణంగా మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. బాహుబలి తర్వాత సంఘమిత్ర లాంటి చిత్రాన్ని నిర్మించవద్దనే వాదనను పట్టించుకోం. సంఘమిత్ర ఓ అద్భుత చిత్రంగా నిలిస్తుంది అని శృతిహాసన్ ధీమాను వ్యక్తం చేసింది.

English summary
Shruti Haasan says there should be no comparisons made between Sangamithra and Baahubali: The Conclusion as 'there is no such rule that if there is a successful film in a particular genre, then another such film can't be made'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu