»   » పనిగట్టుకుని లండన్ నుంచి వచ్చాడు శృతి కోసం, ఏం జరుగుతోంది ఇద్దరి మధ్యా

పనిగట్టుకుని లండన్ నుంచి వచ్చాడు శృతి కోసం, ఏం జరుగుతోంది ఇద్దరి మధ్యా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత నాలుగైదు రోజులుగా తమిళ సిని వర్గాల్లో ఓ హాట్ టాపిక్ రన్ అవుతోంది. కమల హాసన్ కూతురు, నటి శ్రుతి హాసన్ డేటింగ్‌లో ఉందా? అతడితో కలిసి వేలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుందా? అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం.. వేలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రుతిహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న మైకేల్ కోర్సాలేతో ముంబై ఎయిర్‌పోర్ట్ బయట కనిపించటమేయ.

మూడు నెలల నుంచి అతడితో ప్రేమలో ఉందట. అంతేకాదు.. అతడిని తన తండ్రి కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసిందని కోలీవుడ్ టాక్. ఇంతకీ ఎవరీ శృతిహాసన్ మనస్సు దోచుకున్న మనోహరుడు అంటే.. కోర్సాలే .. ఇటలీ జాతీయుడు. లండన్‌లో నటుడు.

ప్రస్తుతం 'బెహెన్ హోగీ తేరీ' అనే సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. దీంతో ఆమెతో టైం స్పెండ్ చేసేందుకు అతడు ముంబైకి వచ్చాడని టాక్. అంతేకాదు.. ఇటీవల శ్రుతి తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పెట్టిన పోస్టు కూడా ఆమె ప్రేమలో పడిందనేదానికి బలం చేకూరుస్తోందని అంటున్నారు. 'ప్రతి అడుగు విలువైనదే. అది కలిసి వేసినా.. ఒంటరిగా పడినా. మీ గమ్యం చేరేదాకా నడవాల్సిందే' అని ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

Shruti Hassan about affair with London Actor

తాజాగా ఈ బ్యూటీ ఓ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ తో ఎయిర్ పోర్టులో కనిపించింది. ఇతను లండన్ బేస్డ్ యాక్టర్ కావడం.. వృత్తులు ఒకటే కావటం, ఇద్దరూ ఆలోచనలు కలవడంతో ఈ మైకేల్ కోర్సలేను శృతి హాసన్ లవర్ గా ఎంచుకుంది అంటున్నారు మీడియా జనాలు.

సాధారణంగా ఇలాంటి రూమర్స్ పై శృతి స్పందించదు కానీ.. ఈసారి మాత్రం ఎందుకనో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మైకేల్ కు తనకు మధ్య ఏమీ లేదని చెప్పింది.అంతేకాదు..జస్ట్ తామిద్దం మంచి ఫ్రెండ్స్ మాత్రమే ఓ పెద్ద క్లారిటీ కూడా ఇచ్చేసింది శృతి. అంతటితో ఆగకుండా తనకు ఎవరితోనూ రిలేషన్స్ లేవని డీటైల్డ్ గా వివరించింది. దీంతో మైకేల్ తో ఈమె చెట్టాపట్టాల సంగతి అంతా జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని అనుకోవాలి మరి. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే.. వచ్చే నెలలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడుతో.. తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది శృతి హాసన్.

English summary
Rumours are rife in the industry that Shruti Hassan is dating London based actor, Michael Corsale. The actress was asked about it in an interview. Shruti refused to comment about that and said, “There is nothing. We are just friends”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu